మళ్లీ మొదటికి : జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్టు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు కథ మొదటికి వచ్చింది. కొత్త జడ్జీ వచ్చేదాక విచారణ చేయరు. ఎందుకంటే న్యాయమూర్తుల విభజనలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసులు విచారిస్తున్న జస్టిస్ వెంకటరమణ ఏపీ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్…జనవరి 04వ తేదీ కూడా హాజరయ్యారు. జడ్జీ లేరని…కొత్త జడ్జీ వచ్చేదాక విచారణ చేస్తామని..తదుపరి విచారణ జనవరి 25కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
11 ఛార్జీషీట్లు…
జగన్ అక్రమాస్తులు సంపాదించారనే ఫిర్యాదులతో సీబీఐ 11 ఛార్జీషీట్లు దాఖలు చేసింది. అందులో మూడింటిపై గత మూడేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన జగన్..బెయిల్‌పై విడుదలై ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. ఈ కేసులో పలువురు ప్రముఖులపై కూడా ఛార్జీషీట్‌లు దాఖలయ్యాయి. సో…జగన్ కేసులో విచారణ చేసే జడ్జీ ఎవరు ? ఎలాంటి వాదనలు కొనసాగున్నాయి ? తెలియాలంటే కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.