Earthquake : మణిపూర్, జైపూర్‌లో భూకంపం..భయాందోళనల్లో జనం

దేశంలోని మణిపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. జైపూర్ నగరంలో మూడుసార్లు భూమి కంపించింది....

Earthquake : మణిపూర్, జైపూర్‌లో భూకంపం..భయాందోళనల్లో జనం

Earthquake In Manipur, Jaipur

Updated On : July 21, 2023 / 7:00 AM IST

Earthquake : దేశంలోని మణిపూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. మణిపూర్ లోని(Manipur) ఉఖ్రూల్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 20 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ఇళ్లలో నిద్రపోతున్న జనం రోడ్లపైకి పరుగులు తీశారు.

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ (Jaipur) నగరంలోనూ భూమి కంపించింది. (Earthquake) జైపూర్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున మూడు సార్లు భూకంపం వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటలకు, 4.23 గంటలకు, 3.25 గంటలకు భూమి కంపించింది. అరగంట సమయంలోనే మూడు సార్లు వచ్చిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.