Himachal pradesh Flash floods : హిమాచల్‌లో వరదలు..ఐఎండీ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో కాజా-గ్రాంఫు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై రాకపోకలు నిలచిపోయాయి....

Himachal pradesh Flash floods
Himachal pradesh Flash floods : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో కాజా-గ్రాంఫు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై రాకపోకలు నిలచిపోయాయి.
Plane Crash : కాలిఫోర్నియాలో కూలిన విమానం..ఆరుగురి మృతి
దీంతో స్పీతి నుంచి మనాలీ వస్తున్న 30 మంది కళాశాల విద్యార్థులను పోలీసులు కాపాడారు. (Flash floods, landslide hit Lahaul and Spiti) రోడ్లపై పడిన కొండచరియలను తొలగించే పని చేపట్టారు. రాగల 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చాంబా, కాంగ్రా, కుల్లూ, మండీ, ఉనా, హమీర్ పూర్, బిలాస్ పూర్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Honey Trapped : బీఎస్ఎఫ్ ఉద్యోగిపై పాక్ మహిళా ఏజెంట్ వలపు వల
సిమ్లా, సోలన్, సిర్ మావూర్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. స్పితీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వరదలతో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. సాన్వారా రైల్వేస్టేషన్ టన్నెల్ వద్ద వరదనీరు చేరడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లాహుల్ -స్పితీ మార్గంలో మెరుపు వరదలు, హిమపాతంతో రోడ్లు దెబ్బతిన్నాయి.