తొలిసారి డ్రోన్లతో మిలటరీ ఆపరేషన్‌కు రెడీ అయిన ఇండియా

Drone Swarm System: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇండియాలో తొలిసారి డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ శుక్రవారం నుంచి స్టార్ చేశారు. ఢిల్లీలోని ఆర్మీ డే పరేడ్‌లో కమికాజె మిషన్లను టార్గెట్ చేస్తూ 75డ్రోన్లు పనిచేశాయి. డ్రోన్ గుంపులు ఎయిర్ డిఫెన్స్ కు అదనపు బలం చేకూర్చనున్నాయి. ఇది ఇప్పటికీ ఇండియా కొత్త వార్ ఫైటింగ్ కాన్సెప్ట్ గానే ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నిక్ తో డ్రోన్ ఆపరేషన్లను గత ఆగష్టు నుంచే మొదలుపెట్టాం. మరో కొన్ని డ్రోన్లను అందులో చేర్చునున్నాం. అక్టోబర్ లో 20, డిసెంబర్ లో 35యాడ్ చేయడంతో ఇప్పటికీ 75అయ్యాయి. భవిష్యత్ త్వరలో ఇవి మూడు డిజిట్లు 100, భవిష్యత్‌లో 1000వరకూ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు.
బరువు పరంగా, అధునాతనమైన కెపాసిటీలతో ఆర్మీ ఫిక్స్‌డ్ క్లాస్ డ్రోన్లను ఆపరేట్ చేయనున్నారు. ప్రాణాంతకమైన, మందుగుండు సామాగ్రిని డెలివరీ చేయడానికి ప్రత్యేక ఆర్డర్లతో వీటిని ఉపయోగిస్తారు.
ప్రస్తుతం ఆర్మీ బలగాలు.. 100 పెద్ద ఇజ్రాయేలీ యూఏవీలతో ఉన్నాయి. హెరాన్, సెర్చర్-11 సర్వేలెన్స్, ప్రెసిషన్ టార్గెటింగ్ డ్రోన్ల నుంచి హారోప్ కిల్లర్ వరకూ ఆర్మీ బలగాల వద్ద ఉన్నాయి. డ్రోన్ల గుంపులోకి మరిన్ని చేర్చేందుకు ఆర్మీ డీఆర్డీఓ, ప్రైవేట్ కంపెనీల సహకారం తీసుకోనున్నారు.