India: చైనా, పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రాజెక్టును ప్రారంభిస్తున్న భారత్.. ఎన్ని కోట్లాది రూపాయల ఖర్చో తెలుసా?

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థతో భూతలం నుంచి వివిధ శ్రేణుల్లోని గగనతల లక్ష్యాలను భారత్ ఛేదించవచ్చు.

India: చైనా, పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రాజెక్టును ప్రారంభిస్తున్న భారత్.. ఎన్ని కోట్లాది రూపాయల ఖర్చో తెలుసా?

Air Missile

India- Air defence system: భూతలం నుంచి ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలోని గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి వాయుతల రక్షణ వ్యవస్థను భారత్ అభివృద్ధి చేస్తోంది. రక్షణ వ్యవస్థలో స్వావలంబనకు ఈ ప్రాజెక్టు మరింత దోహదం చేయనుంది. ఈ మూడు లేయర్ల దీర్ఘశ్రేణి వాయుతల రక్షణ వ్యవస్థ(LRSAM) గగనతలంలోని శత్రుదేశాల యుద్ధ విమానాలు, క్షిపణులను నాశనం చేస్తుంది.

ఈ రక్షణ వ్యవస్థ తయారీ ప్రతిపాదనలకు త్వరలోనే భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ఆమోదం తెలపనుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ వర్గాలు ఓ జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు 20 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది.

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థతో భూతలం నుంచి వివిధ శ్రేణుల్లోని గగనతల లక్ష్యాలను భారత్ ఛేదించవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్ తో కలిసి భారత్ మధ్యశ్రేణి వాయుతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టుల్లో పాలు పంచుకుంది. 70 కిలోమీటర్లకు పై గగనతలంలో ఉన్న శత్రుదేశాల క్షిపణులను ఆ రక్షణ వ్యవస్థ ద్వారా నాశనం చేయవచ్చు.

అలాగే, భారత్ వద్ద ఇప్పటికే భూతలం నుంచి 400 కిలోమీటర్లలోని గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి వాయుతల రక్షణ వ్యవస్థ ఉంది. అయితే, దాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు సొంతంగా అభివృద్ధి చేస్తున్నాం. దాన్ని చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద మోహరించాం. ఇప్పటికే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో డీఆర్డీవో అనేక విజయాలు సాధించింది.

Sudha Murthy : వెజ్, నాన్-వెజ్‌కి ఒకటే స్పూన్ వాడటంపై సుధామూర్తి వ్యాఖ్యలు వైరల్