India Covid Update : భారత్ లో తగ్గుతున్న కోవిడ్ కేసులు-నిన్న 1,685 నమోదు

దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్ను

India Covid Update : భారత్ లో తగ్గుతున్న కోవిడ్ కేసులు-నిన్న 1,685 నమోదు

India Covid Update

Updated On : March 25, 2022 / 10:48 AM IST

India Covid Update :  దేశంలో  కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్నుమూశారు.

దేశంలో ప్రస్తుతం 21,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,16,372 కోవిడ్ కేసులు నమోదు కాగా వారిలో 5,16,755 మంది కోవిడ్ కారణంతో కన్ను మూశారు. నిన్న కోవిడ్ నుంచటి 2,499 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,78,087కు చేరింది.
Also Read : Kurnool : డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు.. రాజకీయ నేత కుమారుడి దాష్టీకం
కాగా మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 182.55,75,126 టీకాలు వేశారు. నిన్న 29,82. 451 డోసులు టీకాలు వేసినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.