Kartarpur Corridor : భారత్-పాక్ సరిహద్దుల్లో తగ్గిన వరదలు..కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర నేడు ప్రారంభం

భారత, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో మంగళవారం కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పున: ప్రారంభం అయింది. పాకిస్థాన్‌లోని చారిత్రాత్మక గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను గురుదాస్‌పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించారు....

Kartarpur Corridor : భారత్-పాక్ సరిహద్దుల్లో తగ్గిన వరదలు..కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర నేడు ప్రారంభం

Kartarpur Corridor To Reopen Today

Updated On : July 25, 2023 / 6:27 AM IST

Kartarpur Corridor To Reopen Today : భారత, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో మంగళవారం కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పున: ప్రారంభం అయింది. పాకిస్థాన్‌లోని చారిత్రాత్మక గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను గురుదాస్‌పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్‌తో కలుపుతూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించారు. (Kartarpur Corridor To Reopen Today) వరదల నేపథ్యంలో సోమవారం సాయంత్రం సరిహద్దు రేంజ్ అమృత్‌సర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) నరీందర్ భార్గవ్ కారిడార్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. (Flood-Situation Eases On Border)

MERS-Coronavirus : అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనావైరస్ పాజిటివ్ కేసు

గతంలో కురిసిన భారీవర్షాల వల్ల రావి నది నీటిమట్టం పెరగడంతో భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో వరదల పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా యాత్రను గతంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. వరదలు తగ్గడంతో మంగళవారం కారిడార్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించినట్లు నరీందర్ భార్గవ్ చెప్పారు. గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ కూడా కర్తార్‌పూర్ కారిడార్‌ను సందర్శించారు.

Tomatoes : ఇక ఆన్‌లైన్‌లో సబ్సిడీ టమోటాల విక్రయం

మంగళవారం 132 మంది సిక్కు భక్తులు కర్తార్ పూర్ కారిడార్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారని గురుదాస్ పూర్ డీసీపీ చెప్పారు. గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్, పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించడానికి యాత్రికుల సౌకర్యార్థం భారత ప్రభుత్వం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర 2019 నవంబర్ 9వతేదీన ప్రారంభమైంది.