Tomatoes : ఇక ఆన్‌లైన్‌లో సబ్సిడీ టమోటాల విక్రయం

దేశవ్యాప్తంగా టమోటాల ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్రం సబ్సిడీపై కిలో 70రూపాయల ధరకే ఆన్‌లైన్‌లో అందించేందుకు సన్నాహాలు చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ఆన్‌లైన్‌లో నెట్‌వ‌ర్క్ ద్వారా కిలో రూ.70లకే టమోటాలను అందిస్తోంది....

Tomatoes : ఇక ఆన్‌లైన్‌లో సబ్సిడీ టమోటాల విక్రయం

Subsidised tomatoes

Tomatoes : దేశవ్యాప్తంగా టమోటాల ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్రం సబ్సిడీపై కిలో 70రూపాయల ధరకే ఆన్‌లైన్‌లో అందించేందుకు సన్నాహాలు చేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ అయిన నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) ఆన్‌లైన్‌లో నెట్‌వ‌ర్క్ ద్వారా కిలో రూ.70లకే టమోటాలను అందిస్తోంది. (Subsidised tomatoes) రాజధాని ప్రాంతంలో వినియోగదారులకు సబ్సిడీ టమోటాలను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నామని ఎన్సీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ జోసెఫ్ చంద్ర చెప్పారు. (now available online through ONDC)

MERS-Coronavirus : అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనావైరస్ పాజిటివ్ కేసు

ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫాం ద్వారా వినియోగ‌దారులు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల వ‌ర‌కూ టమోటాలకు ఆర్డ‌ర్లు చేయ‌వ‌చ్చ‌ని, ఆపై ట‌మాటాల డెలివ‌రీ మ‌రుస‌టి రోజు ఉంటుంద‌ని అనీస్ తెలిపారు. ప్రస్థుతం బహిరంగ మార్కెట్ లో కిలో టమోటా ధర 170 నుంచి 180 రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో తాము ఈ కామర్స్ సంస్థలతో కిలో రూ.70కే వారి ఇళ్ల వద్ద డెలివరీ చేస్తన్నామని అధికారులు చెప్పారు.

Hyderabad : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భయం భయం.. కూలిన బహుళ అంతస్తుల సెల్లార్ ప్రహరీ గోడ, ఆందోళనలో అపార్ట్‌మెంట్ వాసులు

ఒక్కొక్కరికి కేవలం రెండు కిలోల టమోటాలనే ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. సబ్సిడీ టమోటాలను వినియోగదారులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నాఫెడ్, ఎన్సీసీఎఫ్ లను రంగంలోకి దించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మండీల నుంచి టమోటాలను కొనుగోలు చేసి సబ్సిడీ ధరలకు వినియోగదారులకు అందిస్తున్న కేంద్ర అధికారులు చెప్పారు. సబ్సిడీపై టమోటాలను వినియోగదారులకు అందించడం ద్వారా బహిరంగ మార్కెట్ లో వీటి ధరలను అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు. కొత్త పంట రావడంతోపాటు సబ్సిడీపై టమోటాల విక్రయంతో వీటి ధరలు దిగివస్తాయని అధికారులు వివరించారు.