Hyderabad : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భయం భయం.. కూలిన బహుళ అంతస్తుల సెల్లార్ ప్రహరీ గోడ, ఆందోళనలో అపార్ట్‌మెంట్ వాసులు

బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టిందని మండిపడుతున్నారు. దీనిపై GHMC అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. Hyderabad

Hyderabad : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భయం భయం.. కూలిన బహుళ అంతస్తుల సెల్లార్ ప్రహరీ గోడ, ఆందోళనలో అపార్ట్‌మెంట్ వాసులు

Hyderabad(Photo : Google)

Updated On : July 24, 2023 / 11:53 PM IST

Hyderabad Serilingampally : హైదరాబాద్ శేరిలింగంపల్లి నల్లగండ్లలో భారీ బహుళ అంతస్తుల సెల్లార్ ప్రహరీ గోడ కూలింది. దాంతో సెల్లార్ ను అనుకుని ఉన్న అపార్ట్ మెంట్ వాసులు భయాందోళన చెందుతున్నారు. సెల్లార్ రిటైనింగ్ వాల్ కూలడంతో పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ బేస్ మెంట్ కింద నేల కుంగింది. ప్రహరీ గోడలు కుంగుతుండటంతో అపార్ట్ మెంట్ వాసులు భయాందోళన చెందుతున్నారు.

Also Read..Telangana Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

కాగా, బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టిందని మండిపడుతున్నారు. దీనిపై GHMC అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. నిర్మాణ సంస్థ యాజమాన్యం పోలీసుల సాయంతో ఆ రెండు అపార్ట్ మెంట్ లలో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో అపార్ట్ మెంట్ వాసులు ఉన్నారు. రాత్రికి రాత్రి ఎక్కడికి పోవాలో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.