Maharashtra Bus Fire : బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర సీఎం, పీఎం ఎక్స్‌గ్రేషియా.. కేసీఆర్ సంతాపం
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు....

CM Eknath Shinde Announce Ex Gratia
CM Eknath Shinde Announce Ex Gratia : మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాద మృతులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం షిండే కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. (Maharashtra Bus Fire) ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 26 మంది మరణించారు.ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మృతుల బంధువులకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి షిండే ఈ పరిహారం ప్రకటించారు. బుల్దానాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తాం’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం తెలిపింది.
Maharashtra Bus Catches Fire : మహారాష్ట్ర బస్సులో మంటలు.. 25 మంది మృతి
మహారాష్ట్రలోని బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం విదారకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి దహనమైందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఈ బస్సు దగ్ధం ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని బుల్దానా ఎస్పీ సునీల్ కడసానే చెప్పారు.
కేసీఆర్ సంతాపం
మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.