Delhi’s future: భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉంటుందా?.. ఏఐ ఫొటోలు వైరల్

భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో వివరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో జనాల పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఏఐ సాయంతో అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు భయంకరంగా ఉన్నాయి.

Delhi’s future: భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉంటుందా?.. ఏఐ ఫొటోలు వైరల్

Delhi's future

Updated On : January 14, 2023 / 9:29 AM IST

Delhi’s future: ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. కరోనా విజృంభణ సమయంలో తగ్గిన వాయు కాలుష్యం అనంతరం మళ్ళీ పూర్వ స్థితికే చేరుకుంది. రోజురోజుకీ వాయు కాలుష్యం పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

ఇక భవిష్యత్తులో కాలుష్యం మరింత పెరిగి జన జీవనాన్ని మరింత ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఢిల్లీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో వివరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో జనాల పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని ఏఐ సాయంతో అంచనా వేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు భయంకరంగా ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు కాలుష్య బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఢిల్లీ ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లలో మంటతో బాధపడే ప్రమాదం, వీధులంతా పొగమయం అయ్యే ముప్పు ఉందని ఈ ఏఐ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

మాధవ్ కోహ్లీ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలు కాలుష్యంతో ఎలా పోరాడాల్సి ఉంటుందో చెప్పారు. మార్కెట్ కు ప్రజలు మాస్కులు, ఇతర పరికరాలను వాడుతూ ఎలా వస్తారో ఈ ఫొటోల్లో చూడొచ్చు.

Pakistan: పాక్‌లోని పెషావర్‌లో పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి.. డీఎస్పీసహా ముగ్గురు మృతి