Manipur CM Biren Singh : నేడు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?

నిత్యం ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి. మణిపూర్‌లో ఘర్షణలు తీవ్రమవుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం....

Manipur CM Biren Singh : నేడు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?

Manipur CM Biren Singh

Updated On : June 30, 2023 / 2:21 PM IST

Manipur CM Biren Singh : నిత్యం ఘర్షణలతో రగులుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు నానాటికి దిగజారి పోతున్నాయి. మణిపూర్‌లో ఘర్షణలు తీవ్రమవుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. (likely to resign today) రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేతో భేటీ కానున్నారు.

Top Pakistani Snooker Player : ప్రఖ్యాత పాక్ స్నూకర్ ఆటగాడు మాజిద్ ఆత్మహత్య

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. మణిపూర్‌లో జాతి ఘర్షణల మధ్య శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారుతున్నందున మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయ ఉకేకి ఆయన తన రాజీనామాను అందజేయనున్నారని మణిపూర్ వర్గాలు తెలిపాయి.

Amarnath pilgrims : జమ్మూ నుంచి అమరనాథ్ యాత్రకు లెఫ్టినెంట్ గవర్నర్ పచ్చజెండా

మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో వందమందికి పైగా మరణించారు. మొదట్లో మే 3వతేదీన కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించడంతో హింస చెలరేగింది. తమకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మైతేయి సంఘం పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ఈ మార్చ్ జరిగింది. ఈ మార్చ్ పై గిరిజన కుకీ సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.