North India Extreme Heatwave: ఉత్తర భారతంలో వీస్తున్న వేడిగాలులు.. 98 మంది మృతి

విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుతోంది...

North India Extreme Heatwave: ఉత్తర భారతంలో వీస్తున్న వేడిగాలులు.. 98 మంది మృతి

ఉత్తర భారతావనిలో ఠారెత్తిస్తున్న ఎండలు...

North India Extreme Heatwave: విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుతోంది. (North India swelters in Extreme Heatwave) వేడిగాలులతో అల్లాడి జనం అల్లాడిపోతున్నారు. గత మూడు రోజుల్లో తీవ్రమైన ఎండవేడిమి కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 54 మంది, బీహార్ రాష్ట్రంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు.(98 dead in UP, Bihar)

Mundra Port Work Resumes: తుపాన్ తర్వాత ముంద్రా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం.. కరణ్ అదానీ ట్వీట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో గత మూడు రోజుల్లో జ్వరం,వడదెబ్బతో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో మూడు రోజుల్లో 400 మంది బలియా జిల్లా ఆసుపత్రిలో చేరారని వైద్యులు చెప్పారు. బలియా జిల్లా వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని,దీంతో ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరుతున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. ఎండ దెబ్బకు గురైన వారిలో 60 ఏళ్ల వయసు దాటిన వారు ఎక్కువ మంది ఉన్నారని వైద్యులు చెప్పారు. అసలే అనారోగ్యాలతో బాధపడుతున్న వారు తీవ్రమైన వేడి కారణంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియా వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని బలియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ వివరించారు.

Blinken arrives in Beijing: బీజింగ్‌కు వచ్చిన బ్లింకెన్..ఐదేళ్లలో మొదటిసారి చైనా వచ్చిన యూఎస్ దౌత్యవేత్త

యూపీలో జూన్ 15వతేదీన 23 మంది, జూన్ 16వతేదీన 20మంది, జూన్ 17వతేదీన 11 మంది మరణించారు. ఈ మరణాలకు కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని పంపించారు.ఎండ దెబ్బతో వస్తున్న రోగులకు దివాకర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ రోగులు మరియు సిబ్బందికి హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి ఆసుపత్రిలో ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండీషనర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సిఎంఎస్) దివాకర్ సింగ్ తెలిపారు.ఎండ దెబ్బతో పెద్ద సంఖ్యలో రోగులు ఆసుపత్రులకు వస్తుండటంతో స్ట్రెచర్ల కొరత ఏర్పడింది.

Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం.. 24 గంటల్లో ఐదు భూకంపాలు

భారత వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం బల్లియాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.7 డిగ్రీలు ఎక్కువ.పాట్నా, నలందా పట్టణాల్లో ఎండవేడిమితో ఎక్కువమంది మరణించారు.బీహార్ రాజధాని పాట్నాలో గరిష్ఠంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. షేక్‌పురాలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో అత్యంత వేడిగా ఉంది.ఎండల ధాటితో పాట్నాలో జూన్ 24 వతేదీ వరకు పాఠశాలలు మూసివేశారు.రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. జూన్ 18, 19 తేదీల్లో బీహార్ రాష్ట్రానికి వేడిగాలుల హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. ఔరంగాబాద్, రోహ్తాస్, భోజ్‌పూర్, బక్సర్, కైమూర్, అర్వాల్. పాట్నా, బెగుసరాయ్, ఖగారియా, నలంద, బంకా, షేక్‌పురా, జాముయి రెడ్ అలర్ట్ ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు.

Sudan’s Khartoum Air Strike: సుడాన్‌లో వైమానిక దాడి.. ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మృతి

లఖిసరాయ్‌కు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు. తూర్పు చంపారన్, గయా, భాగల్‌పూర్, జెహానాబాద్,తూర్పు చంపారన్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు అందాయి.రాబోయే 5 రోజుల్లో విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఒడిశా, జార్ఖండ్, కోస్తా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,యానాం, బీహార్, పశ్చిమ బెంగాల్,  తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో కూడా వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు.