Modi’s Brother Injured: రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడు, కుటుంబ సభ్యులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. కర్ణాటకలోని మైసూరు-నంజనగూడు హైవేపై వారి కారు వెళ్తున్న సమయంలో డివైడర్ ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవడు కారులో ఉన్నారు.

PM Modi's Brother Injured
PM Modi’s Brother Injured: రోడ్డు ప్రమాదంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా తెలిశాయి. కర్ణాటకలోని మైసూరు-నంజనగూడు హైవేపై వారి కారు వెళ్తున్న సమయంలో డివైడర్ ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆ సమయంలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనవడు కారులో ఉన్నారు. వారంతా మెర్సిడెస్-బెంజ్ ఎస్యూవీలో బందిపురకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. ఆ సమయంలో ప్రహ్లాద్ మోదీ కాన్వాయ్ కూడా ఉందని చెప్పారు. ప్రహ్లాద్ మోదీ కారుకు ప్రమాదం జరిగిందని మైసూరు దక్షిణ పోలీసులు నిర్ధారించారు.
ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను జేఎస్ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరగడంతో ప్రహ్లాద్ మోదీ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Bank Holidays In January 2023 : జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు అంటే..