RSS Chief Mohan Bhagwat: మన విలువలకు కాషాయ జెండా చిహ్నం.. హనుమ మన రోల్ మోడల్: ఆర్ఎస్ఎస్ చీఫ్

‘‘పురాతన కాలం నుంచి స్వచ్ఛంద సేవకులకు హనుమంతుడు రోల్ మోడల్. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చారిత్రక యుగం నుంచి రోల్ మోడల్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెగ్డేవార్, ఇతర ముఖ్య నాయకులు ఎంఎస్ గోల్వాకర్, బాలాసాహెబ్ దియోరాస్ కాషాయ జెండా వ్యక్తిగతం కాదని, ఇది స్వయంసేవక్ ల రోల్ మోడల్ అని చెప్పారు. కాషాయ జెండా మన విలువలకు చిహ్నం. మన మూలధర్మంలోనే మన ఆదర్శాలు ఉన్నాయి. కాషాయ జెండానే మన తత్వానికి చిహ్నం’’ అని మోహన్ భగవత్ చెప్పారు.

RSS Chief Mohan Bhagwat: మన విలువలకు కాషాయ జెండా చిహ్నం.. హనుమ మన రోల్ మోడల్: ఆర్ఎస్ఎస్ చీఫ్

Life should be dedicated to India says RSS chief

Updated On : January 13, 2023 / 8:09 AM IST

RSS Chief Mohan Bhagwat: పురాతన కాలం నుంచి స్వచ్ఛంద సేవకులకు హనుమంతుడు రోల్ మోడల్ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అలాగే, మన విలువలకు కాషాయ జెండా ఓ చిహ్నమని చెప్పారు.

తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘పురాతన కాలం నుంచి స్వచ్ఛంద సేవకులకు హనుమంతుడు రోల్ మోడల్. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ చారిత్రక యుగం నుంచి రోల్ మోడల్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెగ్డేవార్, ఇతర ముఖ్య నాయకులు ఎంఎస్ గోల్వాకర్, బాలాసాహెబ్ దియోరాస్ కాషాయ జెండా వ్యక్తిగతం కాదని, ఇది స్వయంసేవక్ ల రోల్ మోడల్ అని చెప్పారు. కాషాయ జెండా మన విలువలకు చిహ్నం. మన మూలధర్మంలోనే మన ఆదర్శాలు ఉన్నాయి. కాషాయ జెండానే మన తత్వానికి చిహ్నం’’ అని చెప్పారు.

‘‘మీరు ఏ వ్యక్తిని అయినా రోల్ మోడల్ గా తీసుకోవాలని అనుకుంటే మన పురాన కాలానికి చెందిన రామ భక్తుడు హనుమంతుడిని రోల్ మోడల్ గా తీసుకోవాలి. చారిత్రక కాలం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ను తీసుకోవాలి. స్వయం సేవక్ లు సంఘ్ శాఖలకు వ్యక్తిగత లాభాల కోసం రారు.. దేశానికి సేవ చేసేందుకు వస్తారు. హనుమండి విలువలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని తమ స్వయం సేవక్ లకు మోహన్ భగవత్ చెప్పారు.

Dalit man assaulted: గుడిలోకి వచ్చాడని దళిత యువకుడిపై మండుతున్న కర్రలతో దాడి