Viral Video: పులి వెనుక పరిగెడుతూ మొబైల్‌లో వీడియో తీసిన వ్యక్తి

పులి వెనుక పరిగెడుతూ మొబైల్‌లో వీడియో తీశాడో వ్యక్తి. అతడు చేసిన పనికి, నవ్వుకోవాలో, తిట్టుకోవాలో తెలియట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో తీయడం కోసం ప్రమాదకర రీతిలో పులి వెనుక పరిగెత్తిన వ్యక్తికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Viral Video: పులి వెనుక పరిగెడుతూ మొబైల్‌లో వీడియో తీసిన వ్యక్తి

Viral Video

Updated On : January 6, 2023 / 4:14 PM IST

Viral Video: పులి వెనుక పరిగెడుతూ మొబైల్‌లో వీడియో తీశాడో వ్యక్తి. అతడు చేసిన పనికి, నవ్వుకోవాలో, తిట్టుకోవాలో తెలియట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో తీయడం కోసం ప్రమాదకర రీతిలో పులి వెనుక పరిగెత్తిన వ్యక్తికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

పులి వెనకాల వెళ్లిన అతడు చేసిన తప్పుడు పని వల్ల ఈ వీడియో వైరల్ అవుతోందని సుశాంత నంద పేర్కొన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయంపై ఆయన వివరాలు తెలపలేదు. ఓ వ్యక్తి పులివెనుక వెళ్తూ దాని వీడియో తీస్తుంటే, అతడి వీడియోను మరికొందరు తీశారు.

పులి వెనుక వీడియో కోసం వెళ్లడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. పులి ఒక్కసారి తిరిగి చూస్తే అతడి పని ఏమవుతుందని నిలదీస్తున్నారు. పులితో ఆటలు ఆడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

Jammu and Kashmir: గులాం నబీ ఆజాద్‭కు బిగ్ షాక్.. తిరిగి కాంగ్రెస్‭లో చేరిన జమ్మూ కశ్మీర్ నేతలు