జాక్ పాట్ కొట్టిన ఏడాది వయస్సున్న భారతీయ చిన్నారి

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 06:17 AM IST
జాక్ పాట్ కొట్టిన ఏడాది వయస్సున్న భారతీయ చిన్నారి

Updated On : February 6, 2020 / 6:17 AM IST

కేరళకు చెందిన ఏడాది వయసు ఉన్న భారతీయ చిన్నారిని అదృష్టం వరించింది. రాఫిల్ డ్రాలో ఒక మిలియన్ డాలర్లను(సుమారు 7వేల కోట్లుకు పైగా) గెలుచుకుని కోటీశ్వరుడైన ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. 

అసలు విషయం ఏమిటంటే… భారతీయ పౌరుడైన రమీస్ రెహ్మాన్ అనే వ్యక్తి దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. తన అదృష్టం పరీక్షించుకోవాలని ఏడాది వయసు ఉన్న తన కుమారుడు మెుహమ్మద్  సలాహ్ పేరుతో లాటరీ టికెట్ ను కొన్నాడు. లాటరీ సంస్ధ మంగళవారం(ఫిబ్రవరి 4, 2020) న నిర్వహించిన రాఫిల్ లక్కీడ్రా లో 323 సిరీస్ తో తన కుమారుడి పేరుతో కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 1319 ఉండటంతో తన ఆనందంతో మురిసిపోయినట్లు తెలిపాడు. 

రమీస్ రెహ్మన్ మాట్లాడుతూ.. ఈ వార్త తనకి ఎంతో గొప్పదని, తనకి చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా లాటరీ ద్వారా గెలుచుకున్న డబ్బు తన కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చాలా మంది భారతీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోని అదృష్టవంతులు అయిన విషయం తెలిసిందే. గత సంవత్సరంలో ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయ రైతు కూడా రాఫిల్ లక్కీడ్రాలో 4 మిలియన్లు డాలర్లను గెలుచుకుని అదృష్టవంతుడు అయ్యాడు.