ఇతడికి అంతులేని ఆకలి : వయస్సు 10.. బరువు 196 కిలోలు!

ఆ బాలుడి వయస్సు పదేళ్లు.. కానీ, బరువు మాత్రం 196 కిలోలు. అతి చిన్నవయస్సులోనే అధిక బరువు అతడి పాలిట శాపంగా మారింది. కూర్చొలేడు.. నిలబడ లేడు.. అతి భారీ శరీరం బాలుడికి సహకరించేది కాదు.

  • Published By: sreehari ,Published On : May 6, 2019 / 03:11 PM IST
ఇతడికి అంతులేని ఆకలి : వయస్సు 10.. బరువు 196 కిలోలు!

Updated On : May 6, 2019 / 3:11 PM IST

ఆ బాలుడి వయస్సు పదేళ్లు.. కానీ, బరువు మాత్రం 196 కిలోలు. అతి చిన్నవయస్సులోనే అధిక బరువు అతడి పాలిట శాపంగా మారింది. కూర్చొలేడు.. నిలబడ లేడు.. అతి భారీ శరీరం బాలుడికి సహకరించేది కాదు.

ఈ బాలుడి వయస్సు పదేళ్లు.. కానీ, బరువు మాత్రం 196 కిలోలు. అతి చిన్నవయస్సులోనే అధిక బరువు అతడి పాలిట శాపంగా మారింది. కూర్చొలేడు.. నిలబడ లేడు.. అతి భారీ శరీరం బాలుడికి సహకరించేది కాదు. తిన్నాక లేచి సరిగా నిలబడలేడు. నలుగురికి వడ్డించే అన్నం ఒక్కడే భుజిస్తాడు. లేవలన్నా కష్టం.. కూర్చొవాలన్నా కష్టం.. దీంతో అతడి ధీన పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చేతులు దాటిపోక ముందే బాలుడి ప్రాణాలు కాపాడాలంటే కచ్చితంగా సర్జరీ చేయాలని వైద్యులు గట్టిగా సూచించారు.

ప్రపంచంలో అతి బరువైన బాలుడు ఇతడే :
ప్రపంచంలోనే పదేళ్ల వయస్సులో అతిబరువైన బాలుడిగా రికార్డులెక్కిక్కాడు. ప్రపంచంలోనే అతిబరువైన ఇండోనేషియాకు చెందిన ఆర్యా పెర్మనా కంటే ఈ బాలుడే అధిక బరువు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పాకిస్థాన్ కు చెందిన ఈ బాలుడి పేరు.. మహమ్మద్ అబ్రార్ (10). పుట్టిన కొన్నేళ్లకే బరువు పెరుగుతూ వచ్చాడు. అలా పదేళ్ల వయస్సు వచ్చేసరికి 196 కిలోల బరువు పెరిగాడు. బాలుడి తల్లి జరీనా మాట్లాడుతూ..  అబ్రార్ న్యాపీలను మార్చడం తనకు చాలా కష్టంగా ఉండేదని తెలిపింది. బాలుడు నిద్రపోవడానికి.. అనువుగా అతడి బరువుకు తగిన విధంగా స్పెషల్ గా ఓ మంచాన్ని కూడా తయారు చేయించినట్టు ఆమె చెప్పింది. అబ్రార్ పుట్టిన సమయంలో అతడి బరువు 3.6 కిలోలు మాత్రమేనని, అప్పటి నుంచి బరువు పెరగడం ఆగలేదని జరీనా తెలిపింది. 

రెండేళ్లకే 2 లీటర్లు పాలు తాగేవాడు :
రెండేళ్ల వయస్సులోనే రోజుకు రెండు లీటర్ల పాలు తాగేవాడని చెప్పింది. అయినప్పటికీ పొట్ట నిండేది కాదట. ఇంకా కావాలని ఏడ్చేవాడట. తన కుమారుడిని ఎత్తుకోవాలన్న చాలా కష్టంగా ఉండేదని జరీనా చెప్పుకొచ్చింది. అతడి కోసం ప్రత్యేకించి ఊయల, మంచాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అధిక బరువు కారణంగా తన సోదరులతో కలిసి ఆడుకోలేకపోయేవాడని, స్కూల్ కు కూడా వెళ్లేవాడు కాదని చెప్పింది.
10 Years Old Boy Weighing 196 Kg Is The Heaviest In The Worldబాలుడికి జరుగబోయే సర్జరీ ద్వారా అతడి పొట్ట సైజు తగ్గిపోయి గ్యాస్ట్రిక్ బ్యాండ్ లోనికి చొచ్చుకుని పోతుందని ఆశిస్తున్నట్టు జరీనా తెలిపింది. ‘అబ్రార్ అధిక బరువుకు చికిత్స కోసం తాము ఎంతో ఇబ్బందులు పడ్డాం. వైద్య సాయం అందుతుందనే ఆశ వదిలేసుకున్నాం. ఎట్టకేలకు అబ్రార్ కు సర్జరీ ఆపరేషన్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సర్జరీ ద్వారా అబ్రార్ తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చేందుకు సహకరిస్తుందని భావిస్తున్నాం’ అని జరీనా చెప్పింది. 

అంతులేకి ఆకలి.. సమస్య :
అబ్రార్ అధిక బరువు సమస్యపై వైద్యులు మాజ్ మాట్లాడుతూ.. ‘బాలుడికి స్థూలకాయత్వ సమస్య ఉంది. అతడికి అంతులేని ఆకలి ఉంది. తన కుటుంబంలో ఎవరికి ఈ సమస్య లేదు. తల్లిదండ్రులు, అతడి ఇద్దరు సోదరులు అందరూ నార్మల్ గా ఉన్నారు. చిన్న వయస్సులోనే బాలుడు అధిక మోతాదులో భోజనం చేస్తున్నట్టు పేరంట్స్ చెబుతున్నారు. బాలుడికి ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ సర్జరీ చేయబోతున్నాం.

25ఏళ్ల వయస్సు వారికి ఈ సర్జరీ ఎంతో ఉత్తమం. సాధారణంగా సర్జరీ చేయడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. అబ్రార్ సర్జరీ గంట సమయం పడుతుందని అంచనా వేస్తున్నాం’అని తెలిపారు. అధిక బరువుతో బాధపడుతున్న అబ్రార్ సర్జరీ విజయవంతమై.. క్షేమంగా ఆరోగ్యంగా సాధారణ బాలుడిలా తిరిగివస్తాడని ఆశిద్దాం..
10 Years Old Boy Weighing 196 Kg Is The Heaviest In The World