Al Jazeera : ఇజ్రాయెల్ దాడిలో అల్ జజీరా సిబ్బందికి చెందిన 19మంది కుటుంబసభ్యుల మృతి

గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా సిబ్బంది కుటుంబానికి చెందిన 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది తండ్రి, ఇద్దరు సోదరీమణులు, 8మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతని సోదరుడు, సోదరుడి భార్య, నలుగురు పిల్లలు, అతని కోడలు, మామ మరణించారని అల్ జజీరా వార్తాసంస్థ తెలిపింది.....

Al Jazeera : ఇజ్రాయెల్ దాడిలో అల్ జజీరా సిబ్బందికి చెందిన 19మంది కుటుంబసభ్యుల మృతి

Israeli attack

Updated On : November 1, 2023 / 11:43 AM IST

Al Jazeera : గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా సిబ్బంది కుటుంబానికి చెందిన 19 మంది మరణించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది తండ్రి, ఇద్దరు సోదరీమణులు, 8మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అతని సోదరుడు, సోదరుడి భార్య, నలుగురు పిల్లలు, అతని కోడలు, మామ మరణించారని అల్ జజీరా వార్తాసంస్థ తెలిపింది.

Also Read : Israel bombs : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు, హమాస్ కమాండర్ సహా ఉగ్రవాదుల హతం…10వేలకు చేరుకున్న మృ‌తుల సంఖ్య

ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంలోని ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు జరిపిన ప్రదేశంలో పాలస్తీనియన్లు క్షతగాత్రుల కోసం వెతుకుతున్నారు. గాజా స్ట్రిప్‌లోని జనసాంద్రత కలిగిన జబాలియా శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ సిబ్బంది మొహమ్మద్ అబు అల్-కుమ్సాన్ యొక్క 19 మంది కుటుంబ సభ్యులు మరణించారని అల్ జజీరా బుధవారం పేర్కొంది.

Also Read : Commercial LPG cylinder : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెంపు

ఈ దాడిలో కనీసం 50 మంది పాలస్తీనియన్లు, హమాస్ కమాండర్ మరణించినట్లు భావిస్తున్నారు. తమ టీవీ ఇంజినీర్ మొహమ్మద్ అబు అల్ కుమ్సాన్ కుటుంబానికి చెందిన 19 మందిని చంపడం హేయమైన చర్య అని ఇజ్రాయెల్ బాంబు దాడిని అల్ జజీరా ఖండించింది. అల్ జజీరా ఇంజినీరు మొహమ్మద్ కుటుంబసభ్యుల మృతికి సంతాపం తెలిపిన అల్ జజీరా వారికి సంఘీభావంగా నిలుస్తామని పేర్కొంది. పౌరులపై జరిపిన దాడులకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని అల్ జజీరా నొక్కి చెప్పింది.