Commercial LPG cylinder : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెంపు

దేశంలో మళ్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. బుధవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరిగింది. గత రెండు నెలల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి....

Commercial LPG cylinder : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మళ్లీ పెంపు

Commercial LPG cylinder

Commercial LPG cylinder : దేశంలో మళ్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. బుధవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 100 రూపాయలకు పైగా పెరిగింది. గత రెండు నెలల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు బుధవారం దేశంలోని పలు చోట్ల వాణిజ్య ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను రూ. 100కు పైగా పెంచాయి.

Also Read : loot liquor from car : జాతీయ రహదారిపై కారు ప్రమాదం…కారులో నుంచి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1,731కి బదులుగా రూ.1,833 అవుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర పెరుగుదలతో హోటళ్లలో తినుబండారాల ధరలు కూడా పెరగనున్నాయి. ముంబయిలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రూ.1,785.50, కోల్‌కతాలో రూ.1,943, చెన్నైలో రూ.1,999.50లకు పెరిగింది. అక్టోబర్‌లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు ముంబయిలో రూ.1,684, కోల్‌కతాలో రూ.1,839.50, చెన్నైలో రూ.1,898గా ఉన్నాయి.

Also Read : Sachin,Sara Love story : నాడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల ప్రేమ పెళ్లి…నేడు విడాకులు

గృహ అవసరాల వంట అవసరాల కోసం ఉపయోగించే కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.903 వద్ద ఉంది. దేశీయ వంట సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను కేంద్రం పెంచలేదు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు మాత్రమే పెంచింది.

Also Read : Triple Talaq : భార్య కనుబొమలు షేప్ చేయించుకుందని…సౌదీలో ఉన్న భర్త షాక్ ఇచ్చాడు