2024 US prez bid-Trump: నా ఫేస్‌బుక్ ఖాతాను పునరుద్ధరించండి: మెటాను కోరిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఫేస్‌బుక్ ఖాతాను పునరుద్ధరించాలని మెటా సంస్థను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడి, అల్లర్ల ఘటన అనంతరం ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాపై ఆ సంస్థ నిషేధం విధించింది. అలాగే, ఆయన ట్విట్టర్ ఖాతాపై కూడా దాదాపు రెండేళ్ల పాటు నిషేధం కొనసాగింది.

donald trump
2024 US prez bid-Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఫేస్‌బుక్ ఖాతాను పునరుద్ధరించాలని మెటా సంస్థను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడి, అల్లర్ల ఘటన అనంతరం ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాపై ఆ సంస్థ నిషేధం విధించింది. అలాగే, ఆయన ట్విట్టర్ ఖాతాపై కూడా దాదాపు రెండేళ్ల పాటు నిషేధం కొనసాగింది.
అయితే, కొన్ని వారాల క్రితం ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాక డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు. అయినప్పటికీ, ఆ ఖాతాను ట్రంప్ వాడడం లేదు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ట్రంప్ కి సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉండేవారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు ట్రంప్ బృందం వినతి పంపింది. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని కోరింది. కొన్ని రోజుల్లో దీన్ని పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ప్రతినిధులు అంటున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికే మెటా అంతర్గతంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మెటా ప్రతినిధులు ఇప్పటివరకు స్పందించలేదు.
CHINA Population fall : భారీ స్థాయిలో తగ్గిపోతున్న చైనా జనాభా.. 61 ఏళ్లలో ఇదే మొదటిసారి