Greece Ttrain Accident : గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం .. 29 మంది మృతి
గ్రీస్ లో రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85మందికి పైగా గాయపడ్డారు.

Greece Ttrain Accident
Greece Ttrain Accident : గ్రీస్ లో రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85మందికి పైగా గాయపడ్డారు. బుధవారం (మార్చి1,2023) తెల్లవారుఝామున ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 29మంది ప్రాణాలు కోల్పోగా..మరో 85మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టాలు తప్పిన బోగీలు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లాయి.
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిప్రమాదం సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏథెన్స్ కు ఉత్రాన 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే అనే చిన్న పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదంలో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 350మందికిపై ప్రయాణీకులు ఉన్నారని సమాచారం.
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపటానికి చాలామంది ప్రయాణీకులు కిటికీల్లోంచి బయటపడినట్లుగా తెలుస్తోంది. వీరిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గ్రీస్ అగ్నిమాపక అధికారి వాసిలిస్ వర్తకోయనిస్ తెలిపారు.