చిట్టితల్లి పెద్దమనస్సు: కాఫీ, బిస్కెట్లు అమ్మి 123 మంది ఆకలి తీర్చిన చిన్నారి

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 06:31 AM IST
చిట్టితల్లి పెద్దమనస్సు: కాఫీ, బిస్కెట్లు అమ్మి 123 మంది ఆకలి తీర్చిన చిన్నారి

Updated On : December 19, 2019 / 6:31 AM IST

అమెరికాకు చెందిన ఐదేళ్ల చిన్నారి క్యాథలీన్ హార్డీ వయస్సుకు మించిన పెద్దమనస్సును కనబరించింది.  విస్టాలోని బ్రీజ్ హిల్ స్కూల్లో చదువుతున్న ఐదు సంవత్సరాల  క్యాథలీన్ హార్డీ తోటి విద్యార్ధులకు  లంచ్‌ ఫీజులు కట్టింది. లంచ్ కు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న 123 తన స్నేహితులకు లంచ్ ఫీజ్ కట్టింది క్యాథలీన్ హార్డీ. ఐదేళ్ల వయస్సంటే ఆడుకుంటారు. కానీ క్యాథలీన్ మాత్రం అందనంత మనస్సు ఉందని నిరూపించింది. 123 మంది విద్యార్థులకు లంచ్ ఫీజును కట్టివారి ఆకలి తీర్చింది.

తన  తోటి పిల్లలు లంచ్ టైమ్ లో ఏమీ తినకుండా ఆకలితో ఉండటం చూసిన క్యాథలీన్ తన అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పింది. వారికి లంచ్ ఫీజ్ కట్టటానికి డబ్బులు అడిగింది.  కానీ అంత డబ్బు వారి దగ్గర లేదు. మనదగ్గర అంత డబ్బు లేదమ్మా అని చెప్పారు. చిన్నారి మనస్సు చిన్నబోయింది. నా ఫ్రెండ్స్ ఆకలితో ఉంటున్నారు..వాళ్లకు నేను డబ్బులు కట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోయింది. రోజూ స్కూల్ కు వెళుతున్నప్పుడు దార్లో చిన్న చిన్న షాపులు చూసిన ఆ చిట్టి బుర్రకు ఓ ఐడియా వచ్చింది.  ఆ షాపుల్లో బిస్కెట్లు, కాఫీ, టీలు ఇచ్చి డబ్బులు తీసుకోవటాన్ని చూసింది.తను కూడా అలా చేయొచ్చు కదా.. ఆ డబ్బులు తన ఫ్రెండ్స్ కు ఇవ్వొచ్చుకదాని ఆలోచించింది. ఒక ఐదేళ్ల చిన్నారి ఇలా ఆలోచించటం చాలా అద్భుతం. 

అదే విషయాన్ని అమ్మతో చెప్పింది. తమ బిడ్డ తోటివారి ఆకలి గురించి ఆలోచించగలుగుతోందని సంతోషించారు. దీంతో ఐదేళ్ల క్యాథలీన్ తో  కాఫీ, టీ, బిస్కెట్లు వంటి చిన్న చిన్న ఐటెమ్స్ తో డిసెంబర్ 8న చిన్న షాపు పెట్టించారు. తల్లి దగ్గర ఉండి వాటిని ఎలా అమ్మాలో అమ్మ దగ్గరుండి చేయించేది. అన్నీ తెలుసుకుని చక్కగా అమ్మేసేది చిన్నారి క్యాథలీన్.  

స్కూల్ తరువాత క్యాథలీన్ కాఫీ, టీ, బిస్కెట్లు అమ్మేది. చిన్నారి షాపులో ఇవన్నీ అమ్మటానికి చూసిన దారినపోయేవారు విషయం తెలుసుకున్నారు. క్యాథలీన్ పెద్ద మనస్సును మెచ్చుకున్నారు. క్యాథలీన్ షాపులో బిస్కెట్లు,టీ,కాఫీలు కొనేవారు. అలా అమ్మిన డబ్బు 80 డాలర్ల (రూ.5682) వరకూ వచ్చాయి.  ఆ డబ్బును క్యాథలీన్ 123 మంది విద్యార్థులకు లంచ్ ఫీజు కట్టింది. 

ఈ సందర్భంగా క్యాథలీన్ తల్లి కరీనా హార్డీ మాట్లాడుతూ ‘మా అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఇతరులకు సాయం చేయాలంటే ఏం చేయాలని అడిగింది. ఈ ప్రపంచంలో చాలామంది ఆకలితో ఉంటారని, వారంతా మనలా ధనవంతులు కాదని చెప్పాను. మనం అటువంటివారి కోసం ఎంత సాయం చేయాలో అంతవరకూ చేయాలని చెప్పాను. తరువాత మా అమ్మాయి ఒక ఐడియాతో నా దగ్గరకు వచ్చింది. ఒక స్టాల్ ఏర్పాటు చేసి కేకు, కుకీస్ విక్రయించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకు సాయం చేయాలని కోరిందని ఇంత మంచి ఆలోచన ఇంత చిన్న వయస్సులో తమ బిడ్డకు వచ్చినందుకు చాలా సంతోషమేసిందని కరీనా చెప్పారు. 

తరువాత ఆ చిన్నారి తన తల్లితో కలసి ఒక స్టాల్ ఏర్పాటు చేసి 80 డాలర్లు సంపాదించింది. ఈ సందర్భంగా స్కూల్  ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..‘ఇది చాలా సంతోషించాల్సిన విషయమన్నారు. విద్యార్థుల లంచ్ ఫీజు గురించి ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం..కానీ ఈ చిన్నారి క్యాథలీన్ చేసి చూపించిందంటూ ప్రశంసించారు. ఈ స్టాల్‌ను ఇలానే కొనసాగిస్తూ..స్కూల్ విద్యార్థులకు సాయం అందిస్తానమని కరీనా హర్డీ తెలిపారు.