Crocodiles Attack 72 years Man : 72 ఏళ్ల వృద్ధుడిపై 40 మొసళ్లు మూకుమ్మడి దాడి .. క్రూరంగా చంపి తినేసిన దారుణం

ఓ వృద్ధుడికిపై 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేశాయి. ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడాయి.

Crocodiles Attack 72 years Man : 72 ఏళ్ల వృద్ధుడిపై 40 మొసళ్లు మూకుమ్మడి దాడి .. క్రూరంగా చంపి తినేసిన దారుణం

Crocodiles Attack 72 years Man

Updated On : May 26, 2023 / 3:52 PM IST

Cambodia Crocodiles : 72 ఏళ్ల వృద్ధుడిపై ఒకటీ రెండు కాదు ఏకంగా 40 మొసళ్లు దాడి చేసి అత్యంత క్రూరంగా చంపేశాయి. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్ క్లోజర్‌లో పడిన వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు ఎగబడి చంపేసిన దారుణం కంబోడియాలో చోటచేసుకుంది. సీమ్ రీప్ నగరంలో ఉన్న మొసళ్ల ఫామ్‌లోకి వెళ్లిన 72 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్ క్లోజర్‌లో పడిపోయాయి. అంతే దాంట్లో ఉన్న 40 మొసళ్లు ఒక్కసారిగా అతనిపై పడి ముక్కలు ముక్కలుగా కొరికి తినేశాయి. మొసళ్ల దాడిలో వృద్ధుడు అక్కడిక్కడే చనిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడి మృతదేహం చూస్తుంటే పోలీసులే హడలిపోయారు. అంత దారుణంగా చీల్చి చెండాడాయి మొసళ్లు..

సీమ్ రీప్ నగరంలో మొసళ్లను పెంచే ఫామ్‌లు చాలానే ఉంటాయి. మాంసం, గుడ్లు, మొసళ్ల చర్మం కోసం వీటిని పెంచుతారు. అలా ఆ మొసళ్లు ఫామ్ సదరు వృద్ధుడు బంధువులదే. ఫామ్‌లో ఉన్న ఓ మొసలి ఒక బోనులో గుడ్లు పెట్టింది. ఆ బోనులో ఉన్న మొసలిని ఆ వృద్ధుడు బయటికి రప్పించేందుకు ప్రయత్నించాడు. అతని చేతిలో కర్ర పట్టుకుని దాన్ని రప్పించేందుకు యత్నించాడు. ఈక్రమంలో ఓ ఆ మొసలు వృద్ధుడు పట్టుకున్న కర్రను.. తన నోటితో లాగేసింది. దీంతో పట్టు కోల్పోయిన భారీ సంఖ్యలో ఉన్న మొసళ్ల ఎన్ క్లోజర్లో పడిపోయాడు. అంతే ఆ ఎన్ క్లోజర్ లో ఉన్న 40 మొసళ్లు అతనిపై దాడి చేశాయి. దేనికి దొరికిన పార్టును అవి కొరికి తీనేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీమ్ రీప్ పోలీసు చీఫ్ మే సావ్రీ తన బృందంతో అక్కడి వచ్చారు.వృద్ధుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లో పడగానే మొసలి దాడికి దిగి..మిగితా మొసళ్లు కూడా ఆ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయని పోలీసు చీఫ్ మే సావ్రీ దాదాపు ఒకేసారి 40 మొసళ్లు వృద్ధుడిపై దాడి చేయటంతో అతను చనిపోయాడని తెలిపారు. వృద్ధుని శరీరంపై మొత్తం మొసళ్లు కొరికిన గాయాలు ఉన్నాయని..వృద్ధుడి ఒక చేయి మొత్తం విరిచేసి తినేశాయని తెలిపారు. కాగా సీమ్ రీమ నగరంలో గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయని..2019లో అదే గ్రామంలో మొసళ్ల ఫామ్‌లో ఆడుకుంటున్న రెండేళ్ల బాలికను.. అవి చంపి తినేశాయని తెలిపారు.