9th Yoga Day Event: కాపీరైట్లు లేవు, పేటెంట్లు లేవు, అందరికీ ఉచితం.. ఐరాసా నుంచి ప్రపంచానికి మోదీ ‘యోగా డే’ సందేశం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప్రధాని మోదీ యోగా చేశారు

9th Yoga Day Event: కాపీరైట్లు లేవు, పేటెంట్లు లేవు, అందరికీ ఉచితం.. ఐరాసా నుంచి ప్రపంచానికి మోదీ ‘యోగా డే’ సందేశం

Updated On : June 21, 2023 / 8:58 PM IST

PM Modi: భారతదేశంలో పురాతన సంప్రదాయమైన యోగాకి కాపీరైట్లు, పేటెంట్లు లేవని.. రాయల్టీ చెల్లింపులు లేకుండా ఉచితంగా అందరికీ చేరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బుధవారం యోగా డే సందర్భంగా ఆయన అమెరికాలో ఉన్న ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. యోగా అనేది వయసు, లింగ బేధం లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. యోగా నేడు విశ్వవ్యాప్తమైందని, ప్రపంచ నలుమూలలా వ్యాపించిందని అన్నారు.


కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప్రధాని మోదీ యోగా చేశారు. యోగా అనేది ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే కాకుండా, మనతో, పరస్పరం దయగా ఉండేందుకు వినియోగించాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. స్నేహం, శాంతియుత ప్రపంచం, పరిశుభ్రమైన, పచ్చటి, స్థిరమైన భవిష్యత్తుకు యోగా ఉపకరిస్తుందని అన్నారు. ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించడానికి అందరూ చేతులు కలపాలని మోదీ పిలుపునిచ్చారు.