సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్‌… ఆక్స్ ఫోర్డ్ ఆశాభావం 

  • Published By: venkaiahnaidu ,Published On : July 17, 2020 / 05:35 PM IST
సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్‌… ఆక్స్ ఫోర్డ్ ఆశాభావం 

Updated On : July 17, 2020 / 6:53 PM IST

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మహమ్మారిని అంతంచేసేందు వ్యాక్సిన్‌ కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆక్స్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు ఈ పనిని ముమ్మరం చేస్తున్నారు.

ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌లు .. మనుషులపై జరిపిన ఫస్ట్‌ఫేజ్‌ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన‌ట్లు  వెల్లడించారు. తాము తయారు చేసిన టీకా మనుషుల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప‌నిచేసే యాంటీ బాడీలతోపాటు, కిల్లర్ టీ సెల్స్‌ను కూడా ఉత్పత్తి చేయగలిగింద‌ని చెప్పారు. అందువ‌ల్ల‌ ఈ టీకా కరోనా వైర‌స్ నుంచి డబుల్ ప్రోటెక్షన్ ఇవ్వవచ్చని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.

టీకాల ద్వారా మ‌నిషి శ‌రీరంలో త‌యార‌య్యే యాంటీబాడీలు కొన్ని నెలలు మాత్రమే ఉంటాయని, కిల్ల‌ర్‌ టీ సెల్స్ మాత్రం కొన్నేండ్లవరకూ శ‌రీరంలో ఉంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. దీంతో ఆక్స్‌ఫ‌ర్డ్‌ టీకా కరోనా నివారణకు బాగా ఉపయోగపడే అవ‌కాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ టీకా దీర్ఘకాలంపాటు మనుషుల్లో ఎఫెక్టివ్‌గా పని చేస్తుందా? లేదా? అనే విష‌యం మాత్రం తదుపరి ట్రయల్స్‌లోనే తేలుతుందని జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్‌ సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే, రెండో, మూడో ద‌శ ట్రయల్స్‌లో కూడా ఈ వ్యాక్సిన్ మనుషులకు బాగా పని చేస్తున్నట్లు తేలితేనే సక్సెస్ అయినట్లు భావించాలని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ టీకా ట్ర‌య‌ల్స్ సెప్టెంబ‌ర్‌లో పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ట్ర‌య‌ల్స్ పూర్త‌యితే సెప్టెంబ‌ర్‌లోనే మార్కెట్లోకి వచ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌కు చెందిన జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ అన్ని ద‌శ‌ల ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా పూర్త‌యితే.. ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా కంపెనీ దాన్ని ఉత్ప‌త్తి చేసి మార్కెట్‌లోకి తీసుకురానుంది.

 

ఆక్స్‌ఫోర్డ్ ప్రాజెక్ట్ ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా వ్యాక్సిన్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అమెరికా ఔషధ సంస్థ మోడెర్నా… తాము డెవలప్ చేస్తున్న టీకా ప్రాథమిక సానుకూల ఫలితాలను నివేదించింది మరియు ఈ సంవత్సరం చివరినాటికి విడుదల చేయడానికి ఆమోదం పొందాలని భావిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు ఆయా ప్రభుత్వాలు ఆర్థికంగా సహకరించాయి.

రష్యా మరియు చైనా వంటి దేశాలు కూడా వారి టీకా అభివృద్ధి కార్యక్రమాల నుండి సానుకూల ఫలితాలను నివేదించాయి, కాని డేటా బహిరంగపరచబడలేదు.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 14 మిలియన్లకు చేరుకుంది. అధికారికంగా 587,000 మందికి పైగా మరణించారు.

 

ది.