Suicide Attack In Pakistan : పాకిస్తాన్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. ప్రార్థనల కోసం వచ్చిన 28 మంది మృతి

పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Suicide Attack  In Pakistan : పాకిస్తాన్ లోని మసీదులో ఆత్మాహుతి దాడి.. ప్రార్థనల కోసం వచ్చిన 28 మంది మృతి

suicide attack

Updated On : January 30, 2023 / 5:38 PM IST

Suicide Attack In Pakistan : పాకిస్తాన్ లోని పెషావర్ లో ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. షియా మసీదులో ప్రార్థనల కోసం వచ్చిన వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ప్రార్థనల కోసం వచ్చిన వారిలో సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

దగ్గర్లోని ఆస్పత్రుల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. ప్రార్థనల అనంతరం ఈ పేలుడు జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పేలుడు తీవ్రతకు మసీదు ఓ వైపు భాగం ధ్వంసమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో మరో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి.. 53 మంది మృతి

ప్రార్థనల సమయంలో ముందు లైన్ లో నిల్చుకున్న వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడని స్థానికులు చెబుతులున్నారు. ఉగ్ర ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి నిఘా, పోలీసు వ్యవస్థలను మెరుగు పర్చాల్సిన అవసరముందని ఆయన అన్నారు.