Afghan Women : అమెరికన్లకు డబ్బులిచ్చి వివాహం చేసుకుంటున్న అఫ్ఘాన్ మహిళలు
కాబూల్ ఎయిర్‌పోర్ట్ బయట దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాలిబాన్ల గురించి భయపడుతూ దేశ పౌరులు వలసపోయేందుకు విమానాశ్రయం దగ్గరే ఎదురుచూస్తున్నారు.

Afghan Women
Afghan women – Kabul airport: కాబూల్ ఎయిర్‌పోర్ట్ బయట దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాలిబాన్ల గురించి భయపడుతూ దేశ పౌరులు వలసపోయేందుకు విమానాశ్రయం దగ్గరే ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎయిర్ పోర్టు మూసేయడంతో ఇతర దేశస్థులు వెళ్లేందుకు మాత్రమే కొన్ని విమానాలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో తాము విదేశీయుల భార్యలు అని సాక్ష్యం చూపించుకునేందుకు అమెరికన్లను వివాహమాడుతున్నారు.
ఇదంతా కాబూల్ విమానాశ్రయం వెలుపలే జరుగుతుంది. తాలిబాన్ పాలన నుంచి తప్పించుకునేందుకు అమెరికన్లను తమ భర్తలని చెప్పుకుని వెళ్లిపోతున్నారు. దేశాన్ని వదిలి పారిపోవాలనుకుంటున్న అఫ్ఘాన్ మహిళలు కొత్త దారి ఎదుర్కొంటున్నారు. అలా పెళ్లి చేసుకునేందుకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారట.
సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం.. అఫ్ఘానిస్తాన్ ను వదిలి వెళ్లే క్రమంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని.. యూఏఈలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు కూడా బాగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు యూఎస్ డిప్లొమేట్స్. మహిళలతో పాటు ప్రయాణిస్తున్న మగవారిని సైతం నిషేదించారు తాలిబాన్లు. కొన్ని ప్రైవేట్ గ్రూపులు మాత్రం అఫ్ఘాన్స్ పారిపోవడానికి సాయం చేస్తున్నాయి.
అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఆగష్టు 30నే వెళ్లిపోయాయి. అమెరికన్లు వెళ్లిపోయిన తర్వాతే పూర్తి విజయాన్ని సాధించినట్లు తాలిబాన్లు డిక్లేర్ చేశారు.