Afghan : బ్యాగ్ పిండి రూ.2,400, బ్యాగ్ బియ్యం రూ.2,700!
అమెరికన్ డాలర్ తో పోల్చుకుంటే...అప్ఘనిస్థానీ కరెన్సీ అయిన..అప్ఘనీ విలువ పతనమౌతూ వస్తోంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి.

Afghan
Afghans Food : అవును మీరు వింటున్నది నిజమే. పిండి రూ. 2 వేల 400, బ్యాగ్ బియ్యం కొనాలంటే..రూ. 2 వేల 700 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతంత ధరలు చెల్లించలేక ప్రజలు పస్తులు ఉండాల్సి వస్తోంది. ఆకలితో అలమిటించి పోతున్నారు. చిన్నారుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతుండడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వస్తువులు దిగుమతి కాకపోతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. ఇదంతా అప్ఘానిస్తాన్ దేశంలో నెలకొంది. ఇటీవలే…తాలిబన్లు అప్ఘాన్ దేశాన్ని వశం చేసుకున్న తర్వాత పరిస్థితులు దిగజారిపోయాయి.
Read More : Chinese Military Planes : యుద్థవిమానాలతో తైవాన్ పై మరోసారి చైనా బలప్రయోగం
తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత…ఆర్థిక సంక్షోభం రోజురోజుకు దిగజారి వస్తోంది. మంచి పాలన అందిస్తామని తొలుత చెప్పినా..అలాంటి సీన్స్ కనిపించడం లేదు. ఆంక్షలు, నిబంధనల మధ్య ప్రజల జీవనం సాగుతోంది. అమెరికన్ డాలర్ తో పోల్చుకుంటే…అప్ఘనిస్థానీ కరెన్సీ అయిన..అప్ఘనీ విలువ పతనమౌతూ వస్తోంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి. ఏ వస్తువునైనా డాలర్లలో కొని…అప్ఘనీల్లో అమ్ముతామని..అందుకే ఆ రెండు కరెన్సీల మధ్య వ్యత్యాసం ఉండడంతో ధరల పెరుగుదలకు కారణమౌతుందని అక్కడి దుకాణ యజమానులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో…ఏమీ కొనలేని పరిస్థితులు ఏర్పడుతుడడంతో ఒకరోజు తిని..మరొక రోజు పస్తులుంటున్నారు. బియ్యం బస్తా ధర 2 వేల 700 అప్ఘనీలు, పిండి బస్తా ధర 2,400 అప్ఘనీలు, 16 లీటర్ల నూనె 2 వేల 800 అప్ఘనీలుగా ఉన్నాయి. అంతంత ధరలు భరించలేక..అప్ఘన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో చూడాలి.