USA’s Under 19 Team: అమెరికా మహిళా క్రికెట్ టీమ్‌లో అందరూ భారత సంతతి అమ్మాయిలే.. కెప్టెన్‌గా తెలుగమ్మాయి!

అమెరికా మహిళల అండర్-19 క్రికెట్ టీమ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. వరల్డ్ కప్‌లో ఆడబోయే అమెరికా జట్టుకు ఎంపికైన ఈ మహిళలంతా భారత సంతతి వ్యక్తులే. వీరిలో తెలుగమ్మాయిలు కూడా ఉన్నారు.

USA’s Under 19 Team: అమెరికా మహిళా క్రికెట్ టీమ్‌లో అందరూ భారత సంతతి అమ్మాయిలే.. కెప్టెన్‌గా తెలుగమ్మాయి!

Updated On : December 15, 2022 / 5:11 PM IST

USA’s Under 19 Team: అమెరికన్ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ‘ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్’ కోసం ఎంపిక చేసిన అమెరికా జట్టులో అందరూ భారతీయులే ఉండటం విశేషం. మొత్తం జట్టుకు ఎంపికైన మహిళలంతా భారత సంతతికి చెందిన వ్యక్తులే. వారిలో తెలుగువాళ్లు కూడా ఉండటం మరో విశేషం.

Tamil Nadu: ట్రక్కు తాడు మెడకు చుట్టుకుని రోడ్డుపై ఎగిరి పడ్డ బైకర్.. అనూహ్య ఘటన

ఈ టీమ్ కెప్టెన్‌గా ఎంపికైంది తెలుగమ్మాయే. పేరు గీతికా కొడాలి. భారతీయులకు అత్యంత ఇష్టమైన ఆట క్రికెట్. అందుకే మన టీమ్ ఎప్పుడూ ప్రపంచంలోని అగ్రజట్లలో ఒకటిగా కొనసాగుతుంది. ఇక మన వాళ్లు ఎక్కడున్నా క్రికెట్ ఆడటం మరువరు. అవకాశం ఉన్న ప్రతి చోటా క్రికెట్లో సత్తా చాటుతుంటారు. ఇప్పుడు అమెరికాలోనూ మన అమ్మాయిలు క్రికెట్లో రాణిస్తున్నారు. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ తక్కువ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ క్రికెట్‌ను గుర్తిస్తున్నారు. ఆ దేశం కూడా క్రికెట్‌ను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ, జట్లను ఎంపిక చేస్తోంది. గతంలో 2010లో అండర్-19 ప్రపంచ కప్‌లో అమెరికా మొదటిసారిగా ఆడింది. అది పురుషుల జట్టు. ఇప్పుడు తొలిసారిగా అండర్-19లో అమెరికా మహిళల జట్టు కూడా ఆడబోతుంది. దీని కోసం అమెరికా క్రికెట్ జట్టును ఎంపిక చేసింది. ఇందులో ఉన్న 15 మంది ఆటగాళ్లు భారత సంతతి వ్యక్తులే కావడం విశేషం.

Mumbai: అదృష్టమంటే అతడిడే.. బస్సు కింద పడ్డా బతికిపోయాడు.. వైరల్ వీడియో

ఈ 15 మందితోపాటు మరో ఐదుగురిని రిజర్వ్‌లో ఉంచారు. ఎంపికైన జట్టులో తెలుగు రాష్ట్రాల నేపథ్యం కలిగిన గీతికా కొడాలి, భూమికా భద్రిరాజు, లాస్య ముళ్లపూడి వంటి వాళ్లున్నారు. అనేక దేశాల వాళ్లు నివసించే అమెరికా జాతీయ జట్టులో అందరూ భారతీయ సంతతి అమ్మాయిలే ఉండటం కచ్చితంగా ఒక ప్రత్యేకతే. ‘ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్’ వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలుకానుంది. జనవరి 7-29 వరకు ఈ టోర్నీ, దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆటగాడు, భారతీయ సంతతి వ్యక్తి శివనారాయణ్ చంద్రపాల్ కోచ్‌గా వ్యవహరిస్తుండటం మరో ప్రత్యేకత. ఈ టోర్నీలో ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంట జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూపులో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఉన్నాయి. ఇండియా గ్రూప్-డిలో ఉంది.