Tik Tok Banned : టిక్ టాక్ పై నిషేధం.. ఎక్కడో తెలుసా?

టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది.

Tik Tok Banned : టిక్ టాక్ పై నిషేధం.. ఎక్కడో తెలుసా?

banned Tik Tok

Updated On : December 28, 2022 / 6:03 PM IST

Tik Tok Banned : టిక్ టాక్.. చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్. టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది. ఈ మేరకు యాఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

భద్రతా కరాణాల దృష్ట్యా ఇకపై చట్టసభల సిబ్బంది హౌస్ సిబ్బంది డివైజెస్ లో టిక్ టాన్ ను వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్దంగా ఎవరైనా తమ మొబైల్స్ లో టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించాలని సూచించింది.

గూగుల్ Trends : TikTok యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు

ఇప్పటికే అమెరికాలోని టెక్సాస్, జార్జియా, మేరీలాండ్, దక్షిణ డకోటా తదితర రాష్ట్రాలు టిక్ టాక్ ను నిషేధించాయి. ఆయా ప్రభుత్వ డివైజ్ ల్లోని టిక్ టాక్ యాప్ ను తొలగించాయి.