Pfizer Vaccine Trials: చావు బతుకుల మధ్య వ్యాక్సిన్ తీసుకున్న బాలిక!
ప్రస్తుతం కరోనా మహమ్మారికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ 18 సంవత్సరాల పై బడిన వారికి మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్ల కంపెనీలు పిల్లలలో కూడా వ్యాక్సిన్ ట్రైల్స్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఫైజర్ వ్యాక్సిన్ అమెరికాలో పిల్లలపై ప్రయోగాలు నిర్వహిస్తుంది. పలు వయసు వ్యత్యాసమున్న పిల్లలను ఈ ప్రయోగాల కోసం తీసుకోగా అందులో..

Pfizer Vaccine Trials
Pfizer Vaccine Trials: ప్రస్తుతం కరోనా మహమ్మారికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ 18 సంవత్సరాల పై బడిన వారికి మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్ల కంపెనీలు పిల్లలలో కూడా వ్యాక్సిన్ ట్రైల్స్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఫైజర్ వ్యాక్సిన్ అమెరికాలో పిల్లలపై ప్రయోగాలు నిర్వహిస్తుంది. పలు వయసు వ్యత్యాసమున్న పిల్లలను ఈ ప్రయోగాల కోసం తీసుకోగా అందులో వ్యాక్సిన్ తీసుకున్న ఓ 12 సంవత్సరాల బాలిక ఇప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో చావు బతుకుల మధ్య పోరాడుతుంది.
ఓహియోకు చెందిన స్టెఫినీ డి గ్రే కూతురు 12 ఏళ్ల మ్యాడీ డీ గ్రే ఫైజర్ ట్రైల్స్‌లో వాలంటీర్‌గా పాల్గొంది. ఇప్పటికే తొలి డోస్ తీసుకున్న మ్యాడీ ఈ మధ్యనే ఫైజర్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంది. అయితే, ఆ తర్వాతి నుంచి కడుపులో, రొమ్ము భాగంలో నొప్పి రావటం మొదలైంది. గ్యాస్ట్రోపారెసిస్, న్యూసియా, వాంతులు రక్తపోటు వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తగా.. తిన్న ఆహారం కూడా అరుగుదల లేకపోవడంతో.. ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తుండగా.. కనీసం ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో వీల్ ఛైర్‌కు పరిమితమైంది.
మ్యాడీ పరిస్థితిపై స్పందించిన ఆమె తల్లి స్టెఫీనీ ప్రభుత్వ అధికారులు కానీ, ఫైజర్ యాజమాన్యం కానీ తన కూతురు పరిస్థితిపై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నా కూతురికి ఎందుకిలా జరుగుతోందో వాళ్లు కనిపెట్టేందుకు ఈ మేరకు పరిశోధనలు జరగాలని ఆమె వేడుకుంటుంది. ముఖ్యంగా ట్రైల్స్‌లో పాల్గొంటున్న వారి విషయంలో.. ట్రైల్స్‌లో భాగంగా అనారోగ్యం పాలవుతున్న వారికి సరైన చికిత్స అందేలా ఉండాలని.. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఆమె మీడియాకి వెల్లడించారు.