భారత్ ను విమర్శించే హక్కు మనకెక్కడిది : ఇమ్రాన్ సర్కార్ పై పాక్ మానవ హక్కుల కార్యకర్త ఫైర్

చంద్రయాన్-2 పై పాక్ మంత్రులు ఫవాద్ చౌదరి,షేక్ రషీద్,తదితరులు చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాన్ని నాసా సైతం ప్రశంసిస్తుంటే పాక్ మాత్రం తమ దేశ ప్రజలను ఫూల్స్ చేస్తుందని పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అరిఫ్ అజాకియా అన్నారు. ప్రయత్నించిన వారే అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంటారని అన్నారు. పాక్ మంత్రులు ప్రజలను వెధవల్ని చేస్తున్నారన్నారు.
చంద్రయాన్ పై ఫవాద్ చేసిన వ్యాఖ్యలపై అరిఫ్ అజాకియా మాట్లాడుతూ…మీరు జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు. మీరు మంత్రి అయినప్పటి నుంచి ర్యాలీలు తీస్తున్నారు. అదేనా మీ ఉద్యోగం?రిక్షాలు,సైకిళ్ల నుంచి బయటికి రండి.దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ కాలంలో ప్రతిచోటా మెట్రో ఉంటే మీరు మాత్రం రిక్షాలో ఉన్నారు. ఇదే మీ స్థాయి. చంద్రయాన్-2భారత్ ల్యాండ్ మార్క్ మిషన్. భారత్ ప్రయోగాన్ని అభినందిస్తున్నామని నాసా చెబుతోంది. ఇదో పెద్ద అచీవ్ మెంట్ అని నాసా చెబుతోంది. ప్రయత్నించినవాళ్లే ఫెయిల్ అవుతారు అని అన్నారు.
ఎకానమీని హ్యాండిల్ చేస్తాను అని జనరల్ గఫూర్ చెబుతున్నారు. మీరు ఎకానమీని ఐసీయూకి తీసుకొచ్చారు. ఇప్పుడు దాని ఒంటరిగా వదిలెయ్యండి. పాక్ లోని ఖ్వెట్టా సిటీలో గత వారం రెండు బాంబు దాడులు జరిగాయి. శ్రీలంక క్రికెటర్లు పాక్ కు వచ్చేందుకు నిరాకరించారు. పాక్ లో శాంతి భద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నాయి. మీరు ఇతరులకు ఉపదేశిస్తున్నారు. మీరు ట్విట్టర్ యుద్ధాలు చేయటానికి మీ పోస్ట్‌లో ఉన్నారా? మీరు పాక్ దేశాన్ని హాస్యాస్పదంగా మార్చారు. మనం ఎక్కడికి వెళ్లినా ఎగతాళి చేస్తారు. కాశ్మీర్, చంద్రయాన్ -2 గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు! పాక్ ప్రభుత్వం ఇప్పటికైనా భారత్ పై విమర్శలు మానుకొని సొంత దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలని అరిఫ్ హితవు పలికారు.