China : ‘ఫేస్‌కినిస్’ మాస్క్‌ ప్రత్యేకత ఏంటి? చైనాలో ఎక్కువగా ఎందుకు వాడుతున్నారు?

కరోనా మహమ్మారి కారణంగా మాస్క్‌లు ఖచ్చితంగా ధరించడం అలవాటుగా చేసుకున్నాం. ఇప్పుడు చైనాలో ఫేస్‌కినిస్ మాస్క్‌లు ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వాళ్లు వీటిని ఎందుకు వాడుతున్నారు?

China :  ‘ఫేస్‌కినిస్’ మాస్క్‌  ప్రత్యేకత ఏంటి?  చైనాలో ఎక్కువగా ఎందుకు వాడుతున్నారు?

China

China : ఉష్ణోగ్రతలు పెరగడంతో చైనాలో ప్రజలు ‘ఫేస్‌కినిస్’ మాస్క్‌లను  ఆశ్రయిస్తున్నారు. అసలు ఈ మాస్క్ ప్రత్యేకత ఏంటి? అక్కడ వీటికి ఇప్పుడు ఎందుకు డిమాండ్ పెరిగింది?

Android Apps : మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేసేయండి.. లేదంటే.. మీ డేటా చైనా చేతుల్లోకి.. ఇదిగో ప్రూఫ్..!

చైనాలో రికార్డు స్థాయిలో వేడిగాలులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎండ వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటంతో జనం ‘ఫేస్‌కినిస్’ లను ఆశ్రయిస్తున్నారు. వీటిని పాలిస్టర్ వంటి తేలికైన సింథటిక్ బట్టతో తయారు చేస్తారు. టోపీలతో పాటు ఫుల్ మాస్క్‌లకు ఇప్పుడు గిరాకీ పెరిగింది. బీజింగ్‌లో ఉష్ణోగ్రతలు రికార్డు స్ధాయిని దాటుతుందటంతో “ఫేస్‌కినిస్”  మాస్క్‌లు ధరించడం అక్కడ హాటెస్ట్ ఫ్యాషన్‌గా మారిపోయింది.

India Overtakes China: చైనా‭ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్-1 గా నిలిచిన భారత్.. ఇంతకీ ఎందులోనో తెలుసా?

ఎండ వేడిని తట్టుకోవడానికి ఫేస్‌కినిస్‌ను ధరిస్తారు. కళ్లు, ముక్కు రంధ్రాలు. నోరు మినహా మొత్తం ముఖాన్ని కవర్ చేయడానికి ప్రత్యేక స్లీవ్‌లు, UV రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన వెడల్పు అంచుగల టోపీలు, తేలికపాటి జాకెట్‌లు ఇవి చైనాలో ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. చర్మవ్యాధులు రాకుండా, ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి ఇక్కడ జనం ఎక్కువగా ఈ మాస్కులు వాడుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ సంవత్సరం అక్కడ వాతావరణం మెరుగ్గా ఉందని చెప్పాలి. కింగ్‌డావోలో ఈ ముసుగు చాలా ఫేమస్‌గా మారింది. ఇక్కడ ప్రజలు ఎండ వేడి నుంచి.. బీచ్‌లో ఉన్నప్పుడు జెల్లీ ఫిష్, కీటకాలు మరియు ఇతర చికాకుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగిస్తారు.