NASA: గ్రహశకలం ఢీకొని దెబ్బతిన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌.. నాసా శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

ప్రపంచంలోనే అతిపెద్దదైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) దెబ్బతిన్నట్లు నాసా తాజా నివేదికలో పేర్కొంది. 1000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 75,000 కోట్లు)తో ఈ టెలిస్కోప్‌ను రూపొందించారు. గతేడాది డిసెంబర్ 25న అంతరిక్షంలోకి ప్రవేశింపజేశారు. అయితే ఈ ఏడాది మేలో మైక్రో మెటిరాయిడ్ ఢీకొట్టింది.

NASA: గ్రహశకలం ఢీకొని దెబ్బతిన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌.. నాసా శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

Nasa

Updated On : July 19, 2022 / 8:53 PM IST

NASA: ప్రపంచంలోనే అతిపెద్దదైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) దెబ్బతిన్నట్లు నాసా తాజా నివేదికలో పేర్కొంది. 1000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 75,000 కోట్లు)తో ఈ టెలిస్కోప్‌ను రూపొందించారు. గతేడాది డిసెంబర్ 25న అంతరిక్షంలోకి ప్రవేశింపజేశారు. అయితే ఈ ఏడాది మేలో మైక్రో మెటిరాయిడ్ (సూక్ష్మ ఉల్కం) ఢీకొట్టింది, అంతేకాక వేడి సమస్యలు ఇంతకు ముందు అంచనా వేసిన దానికంటే చాలా తీవ్రంగా ఉండటంతో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భారీగా దెబ్బతిన్నట్లు నాసా తెలిపింది.

NASA: విశ్వ‌రూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు

మే 22న అంతరిక్ష టెలిస్కోప్‌లోని ప్రాథమిక అద్దాన్ని ఆరు మైక్రోమీటోరైట్‌లు ఢీకొన్నాయి. ప్రారంభంలో నష్టం చాలా పెద్దదిగా ఉందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. అయితే ఇది ఊహించిన దానికంటే మరింత తీవ్రంగా ఉందని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పూర్తిగా దెబ్బతిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గెలాక్సీలు, అంత‌రిక్షాన్ని స్ట‌డీ చేసేందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను ప్ర‌యోగించారు. భూమి నుంచి 10 ల‌క్ష‌ల మైళ్ల దూరంలో ఈ టెలిస్కోప్ ఉంది.

Images Of The Universe Captured By Nasa's James Webb Space Telescope Have Stunned The World

Images Of The Universe Captured By Nasa’s James Webb Space Telescope Have Stunned The World

టెలిస్కోప్ ద్వారా తీసిన మొదటి చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. మేలో జరిగిన ఉల్క దాడుల కారణంగా పరికరం శాశ్వతంగా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం.. అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం మైక్రోమీటోరాయిడ్ అని, దీని వల్ల ప్రాథమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయని శాస్త్రవేత్తలు తమ నివేదికలో తెలిపారు.