ప్రాణం తీసిన ఫ్రస్టేషన్ : భార్యపై కోపం వచ్చి విమానం హైజాక్ యత్నం

ఢాకా : ఫ్రస్టేషన్ బాబూ ఫ్రస్టేషన్..అది వచ్చిందంటే ఏదోక విధంగా తీర్చేసుకోవాల్సిందే. లేకుండా ఇదిగో ఇటువంటి అనర్ధాలే జరుగుతుంటాయి. కుటుంబంలో భార్యతో తలెత్తిన విభేధాలు ఓ సంచలనఘటనకు దారి తీసింది. తీవ్ర ఒత్తిడితో వున్న సదరు వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో అతనిపై జరిపిన కాల్పల్లో ప్రాణాలు కోల్పయిన ఘటన బంగ్లాదేశ్ చోటుచేసుకుంది.
Read Also: ట్రాఫిక్ చలాన్లపై 50% డిస్కౌంట్ నిజమేనా?
ఫిబ్రవరి 24 న బంగ్లాదేశ్‌లో విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించడం కలకలంరేపింది. ఈ ఘటనలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో హైజాకర్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ హైజాక్ వెనుక ఎలాంటి ఉగ్రకోణం ఉందేమోననే అనుమానంతో దర్యాప్తు చేపట్టిన క్రమంలో వారు విస్తుపోయే వివరాలు వెల్లడయ్యాయి. సదరు హైజాకర్ భార్యతో ఉన్న విభేదాలతో మానసికంగా నలిగిపోయిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడని..అతడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవటంతో ఇలా చేసాడని ఈ క్రమంలో విమానంలోకి తుపాకీ, పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయనే అంశంపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Read Also: జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు
ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయ్ వెళ్లేందుకు.. బీజీ147 విమానం 145మందికిపైగా ప్రయాణికులతో బయల్దేరింది. కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయాణికుడు తుపాకీతో కాక్‌పిట్‌లోకి చొరబడి.. బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. హైజాకర్ బెదిరింపులతో పైలట్లు చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఫ్లైట్‌ను అత్యవసరంగా దించారు. ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే.. భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
ఎయిర్‌పోర్టులో హైజాకర్‌తో అధికారులు చర్చలు జరిపారు. అతడు బంగ్లాదేశ్ ప్రధానితో మాట్లాడాలని..ముందు ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేయాలని అధికారులు విజ్ఞప్తి చేయడంతో ఒప్పుకున్నాడు. వెంటనే ప్రయాణికుల్ని ఎమర్జన్సీ వే నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం కమాండోలు హైజాకర్‌ను లొంగిపోవాలని హెచ్చరించారు. అతడు దానికి ఒప్పుకోలేదు. దీంతో అతడిపై కాల్పులు జరిపాల్సి వచ్చింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు.హైజాకర్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా అధికారులు గుర్తించారు.
Read Also: సమ్మర్ స్మార్ట్ ట్రెండ్ : కొత్త 5G స్మార్ట్ ఫోన్లు ఇవే