ఇవాంకా ట్రంప్ ని కలిసిన ఆస్ట్రేలియా హోం మంత్రికి కరోనా పాజిటివ్

ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. శుక్రవారం(మార్చి-13,2020)నుంచి ఆయనను హాస్పిటల్ లో క్వారంటైన్(నిర్భందం)చేశారు. గత వారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటన సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న వాషింగ్టన్ స్టేట్ లో ఆయన పర్యటించారు.
అంతేకాకుండా మార్చి-6న వాషింగ్టన్ లో పీటర్ దుట్టన్… అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్,యూఎస్ అటార్నీ జనరల్ విలియమ్ బార్ ని కలిశారు. అంతేకాకుండా అక్కడే బ్రిటన్,న్యూజిల్యాండ్ ,కెనడా ఇంటెలిజెన్స్ అలియన్స్ సభ్యులతో కూడా దుట్టన్ సమావేశమయ్యారు. అక్కడే ఆయనకు కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
దుట్టన్ తో కలిపి ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో కరోనా(COVID-19)సోకిన వారిసంఖ్య 184. దుట్టన్ ఆస్ట్రేలియా ప్రభుత్వంలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి. అంతేకాకుండా ఆస్ట్రేలియా యొక్క వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టాల రూపకల్పనలో దుట్టన్ ముఖ్యడు. శుక్రవారం ఉదయం గొంతుమంట,టెంపరేచర్ తో తాను నిద్ర లేచినట్లు దుట్టన్ తెలిపారు.
ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఆయన రోగ నిర్థారణ ఇప్పుడు ఆస్ట్రేలియా కేబినెట్ లోని ఇతర మంత్రులు,ప్రధాని స్కాట్ మోరిసన్ కు సోకవచ్చనే ఆందోళన నెలకొంది. మంగళవారం(మార్చి-10,2020)దుట్టన్ కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యారని ప్రధానమంత్రి కార్యాలయం కన్ఫర్మ్ చేసింది. అయితే ఇతర కేబినెట్ సభ్యులు క్యారంటైన్ చేయబడరని తెలిపింది.
ఎవరైతే దుట్టన్ కి వైరస్ సోకినట్లు నిర్థారణ అయిన 24గంటలముందు ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్లు మాత్రం సెల్ఫ్ ఐసొలేట్ అవ్వాలని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.వాషింగ్టన్ పర్యటనలో దుట్టన్ కలిసిన వారిలో న్యూజిల్యాండ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ట్రేసీ మార్టిన్ ను కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తనకు తాను సెల్ఫ్ ఐసొటేట్ అయ్యారు. శనివారం ఆయనకు కరోనా టెస్ట్ లు చేయబడతాయని న్యూజిల్యాండ్ మీడియా రిపోర్ట్ చేసింది.