Divorce : భర్తకు బట్టతల.. పెళ్లైన రెండవరోజే విడాకులు కోరిన భార్య
పెళ్లైన రెండు రోజులకే విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కింది భార్య.. విడాకులు కోరడానికి మహిళ చెబుతున్న కారణం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు బంధువులు.

Divorce
Divorce : పెళ్లైన రెండు రోజులకే భర్త నుంచి విడాకులు కోరడంతో.. కట్టుకున్నవాడితో పాటు అత్తింటి వారు షాక్ కి గురయ్యారు. ఇక ఆమె విడాకులకు చెబుతున్న సాకు విని అందరు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. సౌదీలో ఓ జంటకు తాజాగా వివాహం జరిగింది. అనంతరం మొదటి రాత్రి కోసం ఏర్పాట్లు చేశారు. అందరు కలిసి యువతిని బెడ్‌రూమ్‌లో తోలారు. ఆలా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఇలా పరుగున బయటకు వచ్చింది. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడిగితే భర్తకు బట్టతల ఉందని సమాధానం చెప్పింది.
Read More : World Heart Day: గుండెను గడ్డ కట్టించి..తిరిగి కొట్టుకునేలా చేసిన శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ..!
తనకు బట్టతల ఉన్న భర్త వద్దని, విడాకులు కావాలని కోరింది. అతడికి బట్టతల ఉందనే విషయం చెప్పకుండా పెళ్లి చేశారని, సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేయడంతో తనకసలు తల కనపడలేదని.. ఇది మోసపూరితమైన వివాహమని చెబుతూ కోర్టు మెట్లెక్కింది. అయితే సౌదీలో విడాకులు విషయంలో సయోధ్యకు ప్రయత్నించడం తప్పనిసరి. ఈ క్రమంలోనే మ్యారేజ్ కౌన్సిలర్‌తో మహిళ మాట్లాడుతూ.. వివాహానికి ముందు వరుడు తన తలను తెల్లటి వస్త్రంతో(ఘుత్రా) కప్పుకున్నాడని చెప్పింది. కానీ వారి వివాహం తర్వాత అతనికి బట్టతల ఉందని ఆమెకు తెలిసిందని తెలిపింది.
Read More : shockingl video : కొమ్మకు వేలాడుతూ..ప్రసవించిన అనకొండ..!!
అతను తనకు ద్రోహం చేసినట్లు భావించి విడాకులు కావాలని కౌన్సిలర్‌తో చెప్పింది. ‘నా స్నేహితులు, బంధువుల ముందు నేను సిగ్గుపడుతున్నాను. నా పిల్లలు బట్టతలకి గురవుతారనే ఆందోళన నాకు ఉంది. ఇకపై అతనితో కలిసి జీవించడం నాకు చాలా కష్టం’ అని ఆ మహిళ తెలిపింది. అయితే ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో మరోసారి కౌన్సిలింగ్ కి రావాలని అధికారులు తెలిపారు. న్యావాదులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. ఇది గతంలో చూడని వింత విడాకుల కేసు అని వ్యాఖ్యానించారు.