భారత్ సర్జికల్ ఎటాక్స్ : ఒక్కరు కూడా చనిపోలేదన్నపాక్ 

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 06:13 AM IST
భారత్ సర్జికల్ ఎటాక్స్ : ఒక్కరు కూడా చనిపోలేదన్నపాక్ 

Updated On : February 26, 2019 / 6:13 AM IST

పాకిస్థాన్ : పుల్వామా దాడికి పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకార దాడికి పాల్పడింది. ఈ దాడిలో పాకిస్థాన్ కు చెందిన 300ల మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం. దీనిపై పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. 
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

భారత యుద్ధ విమానాలు పీఓకే ప్రాంతంలో దాడులు జరిపి..భారీ  ప్రాణనష్టానికి కారణమైనట్టు వచ్చిన వార్తలను మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రంగా ఖండించారు. “ముజఫరాబాద్  సెక్టార్ లో భారత విమానాలు సరిహద్దులను దాటి మూడు నుంచి నాలుగు మైళ్ల దూరం వచ్చాయనీ.. అవి కొన్ని బాంబులను జారవిడిచాయి. అవి ఖాళీ ప్రాంతంలో పడ్డాయి తప్ప..మాకు ఎటువంటి నష్టాన్నికలిగించలేదనీ..ఒక్కరు కూడా మరణించలేదు. మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడిస్తాం” అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Also Read : బోర్డర్ లో హై ఎలర్ట్ : ప్రధాని మోడీ ఎమర్జన్సీ మీటింగ్
Also Read : ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం