US Presidential Polls-2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా.. కానీ..: బైడెన్

బైడెన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంపై శ్వేతసౌధ సలహాదారులు తుది ప్రతిపాదనలను త్వరలోనే చేయనున్నారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

US Presidential Polls-2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా.. కానీ..: బైడెన్

US Presidential Polls-2024

Updated On : April 10, 2023 / 9:35 PM IST

US Presidential Polls-2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని… కానీ, ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయడానికి ఇప్పటివరకు సన్నద్ధం కాలేదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Presidential Polls-2024) జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిపై డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి.

ఇవాళ ఓ ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. మళ్లీ పోటీ చేస్తానని.. ప్రకటన చేయడానికి మాత్రం ఇప్పటికీ సన్నద్ధం కాలేదని అన్నారు. బైడెన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంపై శ్వేతసౌధ సలహాదారులు తుది ప్రతిపాదనలను త్వరలోనే చేయనున్నారు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

పోటీ చేస్తానని ప్రకటించిన తొలి అభ్యర్థి ట్రంప్. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రణాళికలు వేసుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ 2016 రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2020లో ట్రంప్ మళ్లీ పోటీచేసి జో బైడెన్‌ చేతిలో ఓడిపోయారు.

Blast In Pakistan : పాకిస్తాన్ లో భారీ పేలుడు.. నలుగురు మృతి