Biden’s Surprise Kyiv Visit: ఉక్రెయిన్‌లో బైడెన్ సర్‌ప్రైజ్ విజిట్.. జెలెన్ స్కీతో చర్చలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న అధికారికంగా సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ యుద్ధం ప్రారంభమై మరో నాలుగు రోజుల్లో సంవత్సరం అవుతుంది.

Biden's Surprise Kyiv Visit
Biden’s Surprise Kyiv Visit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 24న అధికారికంగా సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ యుద్ధం ప్రారంభమై మరో నాలుగు రోజుల్లో సంవత్సరం అవుతుంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో జో బైడెన్ పర్యటిస్తుండడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని బైడెన్ కలిశారు. అంతకు ముందు కీవ్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లను మోగించారు. మిలటరీ అధికారులు బైడెన్, జెలెన్ స్కీకి గౌరవ వందనం సమర్పించారు. కొన్ని నిమిషాలు ఇరువురు అధ్యక్షుడు మౌనం పాటించారు. ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా బైడెన్ ఆ దేశానికి పలు హామీలు ఇచ్చారని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్ తన ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు ఆ దేశానికి సాయం అందించేందుకు అమెరికా పూర్తి నిబద్ధతతో ఉందని, మరిన్ని ఆయుధాలు అందిస్తామని బైడెన్ అన్నారు. యాంటీ-ఆర్మర్ వ్యవస్థలతో పాటు నిఘా రాడార్లను కూడా అందిస్తామని తెలిపారు. బైడెన్ ను ఉక్రెయిన్ కు స్వాగతమని, ఆయన పర్యటన ఉక్రెయిన్ ప్రజలకు చాలా ముఖ్యమని జెలెన్ స్కీ చెప్పారు. కాగా, రష్యా చేస్తున్న దాడులను విదేశాల సాయంతో ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు అమెరికా భారీగా సాయాన్ని అందించింది.