Bomb Cyclone: అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్.. వేడి నీళ్లూ మంచుగా మారుతున్న వైనం.. వీడియో ఇదిగో

అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచు ప్రభావంతో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది.

Bomb Cyclone: అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్.. వేడి నీళ్లూ మంచుగా మారుతున్న వైనం.. వీడియో ఇదిగో

Updated On : December 24, 2022 / 1:48 PM IST

Bomb Cyclone: అమెరికాను మంచు తుపాన్ వణికిస్తోంది. అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది. అయితే, వాతావరణం మాత్రం ఊహించని స్థాయిలో ఇబ్బంది పెడుతోంది. భారీ స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad: నేడు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో దారి మళ్లింపు

అనేక ప్రాంతల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మంచు కురుస్తుండటం వల్ల రోడ్లపై వాహనాలు కదిలే పరిస్థితి లేదు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు వేలాది విమానాల్ని రద్దు చేశారు. వాషింగ్టన్ పరిధిలోనే 449 విమానాలు రద్దయ్యాయి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకొనే పరిస్థితి లేదు. చాలా చోట్ల ఈవెంట్స్ రద్దయ్యాయి. ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందానమనుకున్న వాళ్లకు మంచు తుపాన్ అడ్డంకిగా మారింది. అమెరికాతోపాటు కెనడాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో మంచు ప్రభావం ఎక్కువ. కాగా, అమెరికాలో మంచు, చలి ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు స్తానికులు పలు వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అక్కడ వేడి నీళ్లు కూడా గడ్డకట్టేంత చలి ఉందని పలువురు వీడియోల ద్వారా వెల్లడిస్తున్నారు.

తాజాగా అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఒక వ్యక్తి జగ్గులోని వేడి నీటిని గాలిలోకి ఎగరేయగా, అవి క్షణాల్లోనే గడ్డకట్టిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తోంది.