శ్రీలంకలో బాంబు పేలుళ్లు: స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశం

శ్రీలంక వరస బాంబు పేలుళ్లతో రెండు రోజుల పాటు (ఏప్రిల్ 22,23) విద్యాసంస్థలు అన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేశంలో చర్చిల్లో ఈస్టర్ పండుగ వేడులు జరుగుతుండగా ఒక్కసారిగా సంభవించిన పేలుళ్లకు దేశం యావత్తు దద్దరిల్లిపోతోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. దాదాపు 190మంది వరకూ చనిపోగా..వందలాదిమంది గాయాలపాలయ్యారు. దీంతో ఆయా ప్రాంతాలలో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి.
దేశవ్యాప్తంగా భయాందోళనలు కొనసాగుతున్నాయి. 200 ట్రూప్‌లను ఆర్మీ మోహరించింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని కొలంబోలోని మూడు ఖరీదైన హోళ్లు, ఓ చర్చితో పాటు కొలంబో సమీపంలో ఒకటి, తూర్పు ప్రాంతంలో మరొక చర్చి లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాగా ఈపేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ప్రకటించుకోలేదు. ఈ పేలుళ్లు కారణం ఏమిటనేది కానీ, ఉగ్రదాడి కావచ్చని అధికారులు భావిస్తున్నారు.