జాక్ మాను వెనక్కి నెట్టేసి…చైనా సంపన్నుడిగా జాంగ్ షాన్‌షాన్

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టేసి.. చైనాలో అత్యంత సంపన్నుడిగా జాంగ్ షాన్‌షాన్ నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో.. తాజాగా షాన్‌షాన్ చేరారు. ఆసియా ఖండంలో సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ తర్వాత రెండవ స్థానంలో షాన్‌షాన్ నిలిచారు.
ప్రపంచ కుబేరులతో కూడిన 500 మంది జాబితాలో షాన్‌షాన్ 17వ ర్యాంక్‌లో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం…షాన్‌షాన్ ఆస్తి సుమారు 58.7 బిలియన్ల డాలర్లు. ఇటీవల స్టాక్ మార్కెట్‌లో ఆయన కంపెనీ షేర్లు పెరిగాయి.
అంతే కాదు షాన్ షాన్ కంపెనీ ఓ టీకా తయారీ సంస్థలో వాటా కొన్నట్లు తెలుస్తోంది. 1996లో షాన్‌షాన్ వాటర్ బాటిళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. చైనాలోని జీజాంగ్ రాష్ట్రంలో అతను నంగ్‌ఫూ స్ప్రింగ్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఒంటరి తోడేలు అని షాన్‌షాన్ కు పేరు ఉంది.