Meirivone Rocha Moraes : బొమ్మను పెళ్లాడిన మహిళ.. ఇప్పుడు బిడ్డ కూడా..

బొమ్మల పెళ్లి గురించి వినే ఉంటారు.. బొమ్మనే పెళ్లాడింది ఓ మహిళ.. ఇప్పుడు ఒక బిడ్డ కూడా.. ఈ వింత పెళ్లి కథ చదవండి.

Meirivone Rocha Moraes : బొమ్మను పెళ్లాడిన మహిళ.. ఇప్పుడు బిడ్డ కూడా..

Meirivone Rocha Moraes

Updated On : November 28, 2023 / 2:34 PM IST

Meirivone Rocha Moraes : తనను తాను పెళ్లి చేసుకోవడం, కుక్కర్‌ను పెళ్లి చేసుకోవడం.. చెట్టును పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి వింత కథలు విన్నాం. రాను రాను చాలామందికి పెళ్లంటే నమ్మకం పోతోంది. లివింగ్ రిలేషన్ షిప్స్ పెరిగిపోయాయి. లేదంటే సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే స్టోరీలో అయితే మరీ విచిత్రం.. జీవం లేని బొమ్మను సైతం జీవిత భాగస్వామిగా చేసుకుంది ఓ మహిళ. ఆశ్చర్యపోతున్నారా? గతంలో వైరల్ అయిన ఈ స్టోరి మళ్లీ బయటకు వచ్చింది.

Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు

చిన్నతనంలో బొమ్మల పెళ్లి ఆటలు ఆడుకున్న వారు ఉండే ఉంటారు. సరదాగా బొమ్మలకు పెళ్లి చేసి పిల్లలు సంబరపడతారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది ఓ మహిళ బొమ్మనే పెళ్లి చేసుకున్న కథ. విచిత్రంగా ఉన్నా నిజం. వయసుకి ప్రేమకి సంబంధం ఉండదు అంటారు. ఏ వయసులో అయినా ప్రేమలో పడొచ్చు. అయితే బ్రెజిల్‌కి చెందిన మయిరివోన్ రోచా మోరేస్ అనే 37 సంవత్సరాల మహిళ మాత్రం రాగ్ బొమ్మతో (చేతితో తయారు చేసిన బొమ్మ) ప్రేమలో పడింది. ఆ బొమ్మను ఆమె తల్లి ఇంట్లో తయారు చేసింది. ఆ బొమ్మకు మార్సెలో మోరేస్ అని పేరు కూడా పెట్టారు. ఆ బొమ్మను మోరేస్ పెళ్లి  చేసుకుంది. రీసెంట్‌గా ఈ జంటకు ఓ బిడ్డ కూడా పుట్టింది. షాకవుతున్నారా?

Gold Biscuits : ఎవుర్రా బాబూ నువ్వు! బంగారం బిస్కెట్లు ఎక్కడ దాచాడో చూడండి.. అయినా దొరికిపోయాడు.. వీడియో వైరల్

మోరేస్ తనకు డ్యాన్స్ పార్టనర్ లేడని బాధపడుతూ ఉండేదట. అయితే మార్సెలో ఆమె జీవితంలోకి వచ్చాక ఆమె కల నెరవేరిందట. డాన్స్ పార్టనర్ డొరకడంతో పాటు మార్సెలోనే పెళ్లి చేసేసుకుంది. వారి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా సాగుతోందట. ఆ బొమ్మ తనతో వాదించదని, కొట్టుకోవడం ఉండదని.. ఎప్పుడూ తనను అర్ధం చేసుకుంటుందని మార్సెలో గొప్ప నమ్మకమైన భర్త అని మోరేస్ మురిసిపోతోంది. అంతేనా  ఆసుపత్రిలో ఓ పురుడు కార్యక్రమం జరిగింది. ఈ జంట ఓ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు. త్వరలో రెండో బిడ్డ తమ జీవితంలోకి రాబోతున్నట్లు అనౌన్స్ చేయడమే కాదు గ్రాండ్‌గా పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. వీరి పిల్లలు కూడా ర్యాగ్  బొమ్మలేనండోయ్.. మోరేస్, మార్సెలో పెళ్లి, పిల్లల వార్త నెట్టింట్లో చక్కెర్లో కొడుతోంది. నెటిజన్లు మోరేస్ స్టోరి చదివి మండిపడుతున్నారు. ‘ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చెడిపోయిందని’.. ‘ఎవరైనా 911 కి కాల్ చేయండి.. మన మధ్యలో పిచ్చివాళ్లు తిరుగుతున్నారని’ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి మోరేస్ వింత, విపరీతమైన ప్రేమ కథ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.