Noor Inayat Khan : టిప్పుసుల్తాన్ వంశస్తురాలి చిత్రపటాన్ని ఆవిష్కరించిన బ్రిటన్ రాణి, ఎవరీ నూర్ ఇనాయత్ ఖాన్?
టిప్పుసుల్తాన్ వంశస్తురాలు నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రపటాన్ని బ్రిటన్ రాణి ఆవిష్కరించారు. ఎవరీ నూర్ ఇనాయత్ ఖాన్..? బ్రిటన్,భారత్‌లతో ఆమెకు సంబంధమేంటీ..? అనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. భారత్ నుంచి మాస్కో..మాస్కో నుంచి బ్రిటన్ టిప్పు సుల్తాన్ వారసురాలి ప్రస్థానంలో జీవితంలో జరిగిన మార్పులు..

Noor Inayat Khan..Britains Queen Camilla
Noor Inayat Khan..Britains Queen Camilla : బ్రిటన్ రాణి కెమెల్లా (Britains Queen Camilla) టిప్పు సుల్తాన్ (Tipu Sultan) వంశస్తురాలు నూర్ ఇనాయత్ ఖాన్ (Noor Inayat Khan) చిత్రపటాన్ని ఆవిష్కరించారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాణి కెమెల్లా నూర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నూర్ పై ప్రశంసలు కురిపించారు. బ్రిటన్‌కు నూర్ ఎంతో సేవ చేశారు అంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్‌లోని ఓ రూమ్ కు ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి శ్రాబణి బసూ ఇనాయత్ ఖాన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని కెమిల్లాకు బహుమతిగా అందజేశారు. ఎయిర్స్ ఫోర్స్ క్లబ్ ఇనాయత్ ఖాన్ చిత్రపటం ఆవిష్కరణ ఎంతో గర్వకారణమని.. ఆమె జీవిత చరిత్ర రాసే అవకాశం దక్కడాన్ని ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని శ్రాబణి బసూ అన్నారు.
Ulas family walks : అచ్చం ఆదిమానవుల్లా, ఈనాటికీ నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం ..
టిప్పు సుల్తాన్ అంటే భారత్ కు చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి టిప్పు సుల్తాన్. అటువంటి టిప్పు సుల్తాన్ వంశస్థురాలి చిత్రపటాన్ని బ్రిటన్ రాణి ఎందుకు ఆవిష్కరించారు..? ఎవరీ నూర్ ఇనాయత్ ఖాన్..? అనే ఆసక్తి నెలకొంది.
నూర్ ఇనాయత్ ఖాన్ రష్యాలోని మాస్కోలో 1 జనవరి 1914న భారత్ కు చెందిన హజ్రత్ ఇనాయత్ ఖాన్,అమెరికన్ మహిళ ఓరా రే బేకర్ దంపతులకు జన్మించారు. ఆమె వివాహం తర్వాత తన పేరును అమీనా శారదా బేగంగా మార్చుకున్నారు. నూర్ ఒక యువరాణి. ఆమె తండ్రి ఇనాయన్ ఖాన్ భారత లోని మైసూర్ కు 18వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తికి వారసుడు. ఇనాయత్ ఖాన్ భారతీయ సంగీత శాస్త్ర ప్రొఫెసర్, గాయకుడు, కవి, తత్వవేత్త. ఇనాయత్ ఖాన్ పశ్చిమ భారతదేశంలోని బరోడాలో జన్మించాడు. పశ్చిమ భారతంలో సూఫీ మతాన్ని వ్యాప్తి చేయడానికి దేశాన్ని విడిచిపెట్టారు.
అలా శాన్ ఫ్రాన్సిస్కో చేరి అక్కడ సూఫీ మతం గురించి ప్రసంగించేవారు. అలా రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తిరిగారు. ఈ క్రమంలో అమెరికన్ మహిళ ఓరా రే బేకర్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో వారి కుటుంబం పారిస్ కు మకాం మార్చింది. ఆ తరువాత కొన్నాళ్లకు నూర్ తండ్రి ఇనాయత్ ఖాన్ మరణించారు. ఆయన మరణించే సమయానికి ఆమెకు 13 ఏళ్లు. తరువాత కుటుంబ పోషణ కోసం నూర్ చిన్న చిన్న కథలు, కవిత్వాలు రాస్తుండేది. అలా రచనలు చేస్తు సైకాలజీలో డిగ్రీ చేసారు. ఆమె ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసిన బుద్దుని పునర్జన్మ కథల సమాహారంగా వచ్చిన పుస్తకం అత్యంత ప్రసిద్ధి చెందింది.
G-20 Summit: పుతిన్ దారిలోనే జిన్‌పింగ్.. జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు హాజరు కావడం లేదట
అలా వారి జీవితాలు సాగుతున్న క్రమంలో నూర్ రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ పతనం తరువాత పారిపోయి ఇంగ్లండ్ కు చేరుకుంది. ఇంగ్లండ్‌కు చేరుకున్న ఆమె బ్రిటన్ ఎయిర్ ఫోర్స్‌లోని మహిళా విభాగంలో చేరింది. నిఘా కార్యకలాపాలు, గూఢచర్యంతో శత్రుమూకల కట్టడి కోసం ఉద్దేశించి ఎస్ఓఈ విభాగంలో చేరింది. ఫ్రాన్స్‌పై నిఘా కోసం నియమించిన తొలి మహిళా గూఢచారిగా ఆమె రికార్డు సృష్టించింది. పలు ప్రమాదకర మిషన్లలో తన అసాధారణ ధైర్యసాహసాలతో బ్రిటన్‌కు విజయాలు అందించింది. శత్రుమూకలకు చిక్కినా ఆమె బ్రిటన్ సమాచారాన్ని బయటకు చెప్పలేదు. అలా నూర్ సేవల్ని బ్రిటన్ గుర్తించింది. నూర్ మరణానంతరం బ్రిటన్ ప్రభుత్వం ఆమెను జార్జి క్రాస్ అవార్డుతో సత్కరించింది.
బ్రిటన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మహిళా విభాగంలో ఇనాయత్ ఖాన్ విశేష సేవలు అందించే క్రమంలో విధి నిర్వహణలో తీవ్ర ప్రమాదల్లో చిక్కుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. నూర్ సేవల్ని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం ఆమెను జార్జ్ క్రాస్‌తో సత్కరించింది. ఎయిర్ ఫోర్స్ మహిళా విభాగంలో ఈ పురస్కారం దక్కించుకున్న ఇద్దరు మహిళల్లో ఇనాయత్ ఖాన్ ఒకరు. అలా నూర్ ఇనాయత్ ఖాన్ సేవల్ని బ్రిటన్ రాణి కెమెల్లా గుర్తు చేసుకున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపించి రాయల్ ఎయిర్ ఫోర్స్ క్లబ్‌లోని ఓ రూమ్ కు ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు.