కరోనా కలవరం: ఉద్యోగులు షేక్ హ్యాండ్ ఇవ్వకండి

క్రీస్తు పూర్వం 5సంవత్సరాల నుంచి వస్తున్న ప్రఖ్యాత అలవాటు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే జనం వణికిపోతున్నారు. అప్పట్లో ఎదుటి వ్యక్తి ఎటువంటి ఆయుధం లేకుండా.. ఏ హాని తలపట్టే ఉద్దేశ్యం లేదని చెప్పడానికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారట. ప్రస్తుత పరిస్థితుల్లో షేక్ హ్యాండ్ ఇస్తేనే ఏదైనా అవుతుందేమోనని దూరం పెట్టేస్తున్నారు.
ఈ మేర సింగపూర్ ఎయిర్‌షో 2020 కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎదుటి వారిని విష్ చేసుకునేందుకు ఒకరినొకరు తాకాల్సిన పనిలేదు. అంతర్జాతీయ పద్ధతిలో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. దానికి బదులు తమ సంప్రదాయ సంజ్ఞ చేస్తే సరిపోతుంది.
2014లో దక్షిణాఫ్రికా దేశాల్లో కలవరం పెట్టిన ఎబోలాతోనూ ఇదే పరిస్థితి. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్‌లో యూఎస్ అంబాసిడర్.. వరల్డ్ హెల్లత్ ఆర్గనైజేషన్ అధికారి లిబెరియాను కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంట. అదే సంవత్సరం యూఎస్ డాక్టర్ల గ్రూపు హెల్త్ కేర్ డాక్టర్లు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. హ్యాండ్ షేక్ అనేది నిషేదించాలని దాని ఉద్దేశ్యం.
హాంకాంగ్‌లో 2003 సార్స్ కారణంగా 299మంది చనిపోయారు. అప్పట్లోనూ అంటువ్యాదులు ప్రబలుతున్నాయని అక్కడా ఇదే పద్ధతిని ప్రతిపాదించారు. అంతేకాదు ఇతరులు తాకిన డోర్ హ్యాండిల్స్‌ను, పబ్లిక్ బిల్డింగ్‌లను, మాల్స్‌లలో ప్రతి 2గంటలకోసారి ప్రత్యేక ద్రావణాలతో శుభ్రం చేసేవారు. దగ్గు, తుమ్ములు ఉన్నవారిని దూరంగా ఉంచేవారు.
For the welfare of all attendees, please adopt alternative greetings. Let’s all play our own part to stay safe! #SGAirshow2020 pic.twitter.com/kLpjIROizl
— Singapore Airshow (@SGAirshow) February 10, 2020
Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!