‘‘మీ బొమ్మ కాలు పోయిందా..పోలీస్ స్టేషన్‌కొచ్చి తీసుకెళ్లండి’’

Canada : delta police doll foot road side : కెనడాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ అధికారి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా వెళ్తున్న ఆ పోలీస్ అధికారి వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి తల బైటపెట్టి ‘‘సార్! నేను కారులో వస్తుంటే..పంప్ హౌస్ దగ్గర రోడ్డు పక్కన ఓ కాలు తెగిపడి ఉంది’’ అని చెప్పాడు. దీంతో ఆ పోలీస్ అధికారి సదరు వ్యక్తి చెప్పిన పంప్ హౌస్ దగ్గరకు వెళ్లి చూశాడు. నిజమే రోడ్డు పక్కన తెగిపడిన ఓ కాలు పడి ఉంది.
గబగబా కారు దిగి వెళ్లి చూసిన ఆ పోలీస్ షాక్ అయ్యాడు. ఎందుకంటే అది ఓ బొమ్మ కాలు. ఆ బొమ్మ కాలు చూసిన ఆ పోలీసుకు తనకు ఆ విషయం చెప్పిన వ్యక్తిపై కోపం రాలేదు.పైగా నవ్వుకున్నాడు.వెంటనే ఆ బొమ్మ కాలును తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయాడు.
అనంతరం డెల్టా పోలీస్ డిపార్ట్‌మెంట్ గత మంగళవారం (జనవరి5,2021) తమ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టి ఇలా రాసింది. ‘‘ మీ బొమ్మ ఎడమ కాలు పోయినట్లయితే.. డెల్టా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లండి’’ అంటూ ఫన్నీగా స్పందించింది.
ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ‘‘ ఆ డ్రైవర్ పరిశీలనా నైపుణ్యం అద్భుతం..మహాద్భుతం..భలే భలే అంటూ వెటకారంగా కామెంట్లు చేశారు. మరొకరు సదరు వ్యక్తి భలే కామెడీ పీసు’ అంటే ఇంకొరు ఆ ఎడమ కాలు లేకుండా పాపం ఆ బొమ్మ ఎన్ని అవస్థలు పడుతోందో’’.. అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.