china: చైనా చేతిలో ప్రపంచంలోనే అతిపెద్ద లేజర్ క్రిస్టల్‌.. శత్రు శాటిలైట్లను అంతరిక్షంలోనే తునాతునకలు చేస్తుంది.. ఎలా అంటే..?

చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద బేరియం గాలియం సెలెనైడ్ (BGSe) లేజర్ క్రిస్టల్‌ను రూపొందించారు.

china: చైనా చేతిలో ప్రపంచంలోనే అతిపెద్ద లేజర్ క్రిస్టల్‌.. శత్రు శాటిలైట్లను అంతరిక్షంలోనే తునాతునకలు చేస్తుంది.. ఎలా అంటే..?

china bullds worlds largest laser crystal to target satellites

Updated On : July 27, 2025 / 11:43 AM IST

china: చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద బేరియం గాలియం సెలెనైడ్ (BGSe) లేజర్ క్రిస్టల్‌ను రూపొందించారు. దేశ భద్రత, రక్షణే పరమావధిగా చైనా దీన్ని అభివృద్ధి చేసింది. తమ వైమానిక, అణు స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాల గుట్టును చెప్పే విదేశీ, శత్రు దేశాల శాటిలైట్లను భూమి పైనుంచి లేజర్ క్రిస్టల్ సహాయంతో అంతరిక్షంలోనే తునాతునకలు చేస్తుంది.

లేజర్ కాంతి ఎంతటి శక్తివంతమైందో ఇప్పటికే పరిశ్రమ రంగంలో చూస్తూనే ఉన్నాం. ఈ లేజర్ కాంతిని అంతరిక్షంలో చక్కర్లు కొట్టే శత్రుదేశాల శాటిలైట్లపైకి చైనా ప్రయోగించనుంది. భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే శాటిలైట్లను నేలమీద నుంచే దాడి చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం చైనా బేరియం గాలియం సెలినైడ్ (BGSe) కృత్రిమ స్పటికాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తన కథనంలో పేర్కొంది. ఈ BGSe క్రిస్టల్ నుంచి వెలువడే లేజర్ కాంతి సృష్టించే వినాశనం అంతాఇంతాకాదు.. భూమిపై నుంచే శాటిలైట్లను తునాతునకలు చేస్తుంది.

బేరియం గాలియం సెలినైడ్‌తో తయారైన క్రిస్టల్ 60 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. అంటే.. ఇది ఒక ఖడ్గం అంచుకు ఉండే పదునులాంటిది. ఈ లేజర్ కాంతి ఆకాశంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతతో దూసుకెళ్తుంది. తద్వారా టార్గెట్ గా ఎంచుకున్న శాటిలైట్లను ముక్కలుగా కోసేస్తుంది. అంతరిక్ష, క్షిపణి రక్షణ వ్యవస్థలలో ఆధిపత్యాన్ని సాధించడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆవిష్కరణను కూడా చూస్తున్నారు. ఈ BGSe చదరపు సెంటీమీటర్‌కు 550 మెగావాట్ల వరకు లేజర్ తీవ్రతలను తట్టుకోగలదు, ఇది ప్రస్తుత మిలిటరీ-గ్రేడ్ స్ఫటికాల సామర్థ్యానికి చాలా ఎక్కువ.

1997లో అమెరికా నావికాదళం మిడ్ ఇన్‌ఫ్రారెడ్ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్ (మిరాకిల్) పేరిట ఒక ప్రయోగం చేసింది. సొంత ఉపగ్రహాన్నే పలుమార్లు పరారుణకాంతితో కరిగించేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అమెరికా విజయవంతం అయింది. అయితే, ఆ లేజర్‌బీమ్‌ను వెదజల్లే వ్యవస్థ సైతం కరిగిపోయింది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంటుంది. తీక్షణమైన కాంతి పుంజాన్ని వెదజల్లేటప్పుడు ఈ ఆయుధ వ్యవస్థ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు వేడికి అదే కాలిపోతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా దీనిని చైనా శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు.