చైనాలో ‘క్లీన్ ప్లేట్ క్యాంపేన్’కు ప్రెసిడెంట్ పిలుపు..తక్కువగా వడ్డిస్తున్న రెస్టారెంట్లు..మండిపడుతున్న జనాలు

ఫుడ్ వేస్ట్ చేయ్యొద్దని చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ ఇచ్చిన పిలుపుని చక్కగా అందిపుచ్చుకున్నాయి ఊహాన్ లోని రెస్టారెంట్లు. తమ రెస్టారెంట్ కు వస్తున్న కష్టమర్లకు పొదుపు పొదుపుగా వడ్డిస్తున్నారు. ఎంత పొదుపుగా అంటే రెస్టారెంట్ కు 10మంది కష్టమర్లు వచ్చి..ఫుడ్ ఆర్డర్ చేస్తే 9మందికి సరిపడా మాత్రమే వడ్డిస్తున్నారు. అంత తక్కువగా డిష్ లలో ఆహారాన్ని వడ్డిస్తున్నారు. ఇదేంటీ… అని అడిగితే…ఆహారం పొదుపుగా వినియోగించాలని వృధా కాకుండా జాగ్రత్త వహించాలని మన అధ్యక్షులు వారి పిలుపు వినలేదా? అంటున్నారట..దీన్ని వ్యతిరేకిస్తూ ఆన్ లైన్ లలో విమర్శలు వస్తున్నాయి…
వివరాల్లోకి వెళితే.. ఆహారం వృధా అవుతున్న తీరు బాధాకరమని..ఇది సరైంది కాదనీ అసలే కరోనా కష్టకాలంలో ఆహారాన్ని వృథా చేస్తే ఆహార భద్రత సంక్షోభం వచ్చే అవకాశం ఉందని ప్రతీ ఒక్కరూ ఆహారాన్ని వృథా చేయకుండా ఉండేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చైనాలో ‘‘క్లీన్ ప్లేట్ క్యాంపేన్’’ను జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. కోవిడ్19 వల్ల ఆహారం వృదాపై అప్రమత్తం కావాల్సి వస్తుందని..ఆహార భద్రత సంక్షోభం రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
చైనా దేశవ్యాప్తంగా భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దక్షిణ చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పంట పొలాలు నాశనం అయ్యాయి. న్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపుతో.. వుహాన్ క్యాటరింగ్ పరిశ్రమ సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే..తమ తమ రెస్టారెంట్లకు వచ్చిన వారికి ఒక డిష్‌ను తక్కువగా సర్వ్ చేయాలని.. గుంపుగా రెస్టారెంట్లకు వెళ్లేవారు.. ఒక డిష్‌ను తక్కువగా ఆర్డర్ చేయాలన్న సంకేతాలను జారీ చేశారు. అంటే ఉదాహరణకు పది మంది వెళ్తే.. వాళ్లు కేవలం 9 ప్లేట్ల ఆహారాన్ని మాత్రం ఆర్డర్ చేయాలన్న నిబంధన పెట్టారు. ఈ ఐడియాను వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌లో విమర్శలను మొదలయ్యాయి. ఈ రూల్ ప్రకారంగా చూసుకుంటే 10 మంది వెళితే 9 ప్లేట్లే ఆహారాన్నే ఆర్డర్ చేయాలంటే మరి ఒక్క వ్యక్తి మాత్రమే వెళ్లితే ఎలా? జీరో ప్లేటా? అని ఓ వ్యక్తి వ్యంగ్యాస్త్రాన్ని వదిలాడు.
చైనా ఆహార వ్యతిరేక వ్యర్థాల ప్రచారాన్ని ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2013 లో, “ఆపరేషన్ ఖాళీ ప్లేట్” ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కేవలం భారీ భారీ విందులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆంక్షలను అమలు చేశారు. చైనా లెక్కల ప్రకారం.. 2015లో ఆ దేశంలో సుమారు 18 మిలియన్ టన్నుల ఆహారం వృధా అయినట్లుగా ఆహార భద్రతా అధికారి ఒకరు తెలిపారు.